ఎమ్మార్ నగర్ గ్రామంలో జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడి ప్రచారం

పార్వతీపురం మండలం, ఎమ్మార్ నగర్ గ్రామంలో జనసేన నాయకులు అన్న భక్తుల దుర్గాప్రసాద్, సంతు ఆధ్వర్యంలో పార్వతిపురం మండల అధ్యక్షురాలు ఆగూరుమని అధ్యక్షతన జనసేన – తెలుగుదేశం పార్టీ- బిజెపి పార్టీ- ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న “బోనేల విజయ్ చంద్ర” సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి అవగాహన తీసుకొస్తు ఎమ్మార్ నగర్ గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో  జనసేన నాయకులు, గుంట్రెడ్డి గౌరీ శంకర్, చిట్లు గణేశ్వరరావు, ఖాతా విశ్వేశ్వరరావు భాస్కర్, కనకరాజు, మణికంఠ, సోమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, బిజెపి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.