జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ జూమ్ సమావేశం

ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికలలో కీలకమైన ఎలక్షనీరింగ్ కి ఎన్నారైలు ఏ విధంగా సహాయపడగలమనే విషయాలపై ఆదివారం జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ జూమ్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల నుండి జనసేన నాయకులు వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.

సమావేశంలో చర్చించిన అంశాలు:

  • ఈ ఎన్నికలలో ఏమైనా అవక తవకలు జరిగితే వెంటనే ఎన్నికల సిబ్బందికి తెలిపి కరెక్ట్ చేయించేలా చర్యలు తీసుకునేల చూడాలని అన్నారు.
  • ఓటు వేయించే విధానాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ లా తీసుకొని ప్రజలకు అవగాహన కల్పించాలి.
  • జనసేన-టిడిపి పొత్తుతో పోటీచేసే ఎమ్మెల్యే అబ్యర్ధులకు నిత్యం కాంటాక్ట్ లో ఉంటూ వారికి సహకరించాలి.
  • గ్రామ మరియు వార్డ్ లెవెల్ నుంచి ఎలక్షనీరింగ్ ఎలా జరిపించాలి ఒక బుక్లెట్ మరియు వీడియో తయారు చేసి అవగాహన తీసుకువచ్చే ప్రయతం చేయాలి.
  • నియోజకవర్గ పరిధిలో ఓటర్ లిస్ట్ స్థానికి ఎమ్మార్వో కార్యాలయం నుండి తెప్పించుకుని ఇంటింటికి తిరిగి వెరిఫై చేయించే ప్రయత్నం చేయాలి.
  • తీసివేసిన ఓట్లు, దొంగ ఓట్లని లిస్ట్ అవుట్ చేసి వాటిపై అవగాహన కల్పించి ఎన్నికల సిబ్బందికి తెలియజేయడం.
  • కొత్త ఓట్లు నమోదు చేయించే విధంగా అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయడం.
  • మీడియా సహకారం తీసుకుని ముందుకు వెళ్ళాలి.