రాయపాటి అరుణతో జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ జూమ్ సమావేశం

  • జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఆధ్వర్యంలో 9వ జూమ్ సమావేశం
  • పలు దేశాల నుండి జూమ్ సమావేశంలో పాల్గొన్న ఎన్నారై జనసేన నాయకులు మరియు వీరమహిళలు.

జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఆధ్వర్యంలో ఆ టీమ్ ఫౌండర్ సురేష్ వరికూటి ఆధ్వర్యంలో జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ సభ్యురాలు మరియు ఎన్నారై వీరమహిళ పద్మజ రామిశెట్టి అధ్యక్షతన, ముఖ్య అతిథిగా జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణతో శనివారం జూమ్ సమావేశం నిర్వహించడం జరిగింది. తమ తమ దేశాల నుండి ఒక్కొక్కరిగా సేవలు అందించడం కంటే అందరూ సంఘటితమై ప్రపంచ వ్యాప్తంగా అన్ని టీంలు కలిసి ఒక్క టీంగా వెళ్ళాలి అనే ముఖ్యలక్ష్యంతో ఏర్పడినటువంటి “జె.ఎస్.పి గ్లోబల్ టీం” నుండి వివిధ దేశాలకు చెందిన ఎన్నారై జనసేన నాయకులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. రాయపాటి అరుణ మాట్లాడుతూ వారి రాజకీయం ప్రయాణం ఎలా సాగుతుందో వివరించడం జరిగింది. నాకు రాజకీయం తెలిసిందే పవన్ కళ్యాణ్ వల్లే అని చెప్పాలి. వారి మీద ఉన్న అభిమానాన్ని రాజకీయ అభిమానంగా మార్చుకున్నానని అది 2014 నుంచి సైకిల్ వేసుకొని ఇంటి, ఇంటికి తిరిగి ఓట్లు అడగడం జరిగిందని తెలిపారు. 2019 నుండి 2020 సంవత్సరాలలో సోషల్ మీడియాలో వర్క్ చేయడంవలన, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమస్యలు చూసి ఇలాంటి పరిపాలనలో మనం బ్రతుకుతున్నామా అని, రాజకీయాలలో మార్పులు తీసుకురావాలి గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చెయ్యాలి అని ఆలోచన వచ్చి జనసేన పార్టీ ఆఫీస్ ని గూగుల్ లో వెతుక్కొని ఆఫీస్ కి వెళ్లి సభ్యత్వం తీసుకొన్నానని అన్నారు. ఒక సాధారణ మధ్యతరగతి గృహణిగా ఉన్న నేను, నేడు జనసేనపార్టీ అధికార ప్రతినిధిగా ఉండడం అనేది పవన్ కళ్యాణ్ ఆశయాలే నాకు ఇన్స్పిరేషన్ అని అన్నారు. అలానే నాలాగా మాట్లాడే వాళ్ళు, పని చెయ్యగలిగిన ప్రతి మహిళా కూడా రాజకీయంలోకి వచ్చి మన వ్యవస్థని బాగు చేసేలా పని చెయ్యాలని వివరించారు. మరియు ఎన్నారై జనసైనికులు, వీరమహిళలు అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానాలు ఇవ్వటం జరిగింది. ముందు ముందు ఏ విధంగా మీ సేవలు జనసేన పార్టీకి అందించాలని అనుకొంటున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానంగా నేను పార్టీకి ఏవిధంగా ఉపయోగపడాలి అనేది నాకు క్లియర్ విజన్ ఉంది, దాని ప్రకారం ఒక మహిళగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నా పని చేసుకొంటూ వెళుతున్నాను. జనసేనకి, జనసేన కార్యకర్తలకి ఇబ్బంది కలుగుతుంది అనుకొంటే ఎదుటి వారు ఎంతటి వారయినా ఎదిరిస్తానని అన్నారు. సురేష్ వరికూటి మాట్లాడుతూ ఒక పబ్లిక్ మీడియాలో డిబేట్స్ కి వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు వచ్చి రాళ్లు వేస్తుంటే, ఒక ఫ్రంట్ లైన్ ఫైటర్ లాగా జనసేన తరుపున కూర్చొని ఎక్కడ ఎంత తగ్గాలి, ఎక్కడ రైజ్ అవ్వాలని మరియు ఇది కరెక్టా కాదా అని ఫిల్టర్ చేసుకొంటూ చాలా బ్యాలన్స్డ్ గా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా పోరాడుతున్న మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉందని రాయపాటి అరుణని అభినందించారు. జనసేన పార్టీని గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ అవ్వాలి అంటే మీ ఆలోచన ఏమంటారు ప్రశ్నకు పవన్ కళ్యాణ్ ఒక్కరి వల్లే జనసేన గ్రాఫ్ పెరుగుతుందనే ఆలోచన మార్చుకొని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి పార్టీకి పని చెయ్యాలి. నియోజకవర్గ వారీగా పదవులు తీసుకొన్న వారు ఆ పదవి బాధ్యతలు తెలుసుకొని ఆ ఏరియాలో మనం ఏమి చేస్తే బలపడుతుందని తెలుసుకొని గ్రౌండ్ లెవెల్లో ఇంకా కృషి చెయ్యాలి వాళ్ళు 100% చేస్తున్నాము అనుకొంటే అది సరిపోదు 1000% చెయ్యాలి అనుకొని చేసుకొంటూ పోవాలని అన్నారు. పార్టీని పవన్ కళ్యాణ్ మాత్రమే భుజాల మీద మోస్తున్నారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనమందరం ఆయన వెంటే నిలబడి ఈ పరిస్థితిని అధిగమించాలి. మన అందరికి 2024 పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుందన్న ఆలోచన ఉంది, అది కేవలం ఆలోచనతోనే ఆగిపోకుండా మనం మరింత ప్రభావితంగా పనిచేయాలి అన్నారు. మీలాగా ప్రజలలోకి వచ్చి ప్రజా సమస్యలు మీద మాట్లాడాలి అంటే భయపడతారు అలాంటీ వారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి ప్రశ్నకు సమాధానంగా మనం మాట్లాడితే ఫామిలీని ఎదో చేస్తారని భయపడుతూ పొతే రాబోయే రోజుల్లో మనగురించి పట్టించుకొనే నాధుడు లేదా నాయకుడు ఎవరు లేకుండా పోతారు. కేవలం ఒక్క బానిసత్వం మాత్రమే మిగులుతుంది. ఈరోజు మాటలకే భయపడి ఆగిపోతే ముందు ముందు సమాజంలో రౌడీయిజం పెరిగిపోతుంది. అవన్నీ తట్టుకోగలమా..? అందుకే మొక్కలోనే తుడిపేయలేనిది మాను అయ్యాక తీసెయ్యగలమా అని అందరూ ఆలోచించుకోవాలని అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తున్నారు, లేదంటే వెయ్యటం లేదు ఇది ఎలా ఎదుర్కోబోతున్నారు ప్రశ్నకు సమాధానంగా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనే వ్యామోహంతో రాజకీయంలోకి రాలేదు. వ్యవస్థ పాడవుతుంది, దానిని బాగుచేయడానికి సీఎం కోసం తిరుగుతున్నారు. అది ప్రజలు ఆలోచించుకోవాలి ఇప్పుడు పల్లెటూర్లలో డబ్బు తీసుకున్న వారు తప్పకుండా ఓటు వెయ్యటానికి వస్తున్నారు. వారు డబ్బులు తీసుకున్నారు గనుక వారికే వేస్తూ పోతున్నారు. చదువుకొన్న యువత వాళ్ళని గైడ్ చేసి, ప్రజల్లో మార్పు తీసుకొని వచ్చి ఓటు అనేది కరెక్ట్ గ ఉపయోగించేలాగా మోటివేట్ చెయ్యాలి, అప్పుడే మనకు మంచి వ్యవస్థ అనేది వస్తుంది. అది ప్రజలు గ్రహించాలని చెప్పారు. ఎవరో ఇస్తున్నారని మనం ఇవ్వటానికి, ఆ ఆలోచన కూడా లేదు. ఆలా ఇస్తే సమాజంలో మార్పు అనేది రాదని గ్రహించాలని అన్నారు. ఈ సమావేశంలో జర్మనీ నుండి సురేష్ వరికూటి, చందు, ఆస్ట్రేలియా నుండి నాగ కొమ్మినీడి, హేమలత గాదిరెడ్డి, చరణ్ దామిశెట్టి, దుబాయ్ నుండి ఇంద్రనీల్ ముప్పిడి, యూకె నుండి నాగరాజు వడ్రాణం, హిమవల్లి చలికొండ, కళ్యాణ్ చక్రవర్తి మిట్ట, బాల సుబ్రహ్మణ్యం నల్లి, జోజి గుబిలి, చంద్ర కొండేపూడి, పద్మజ రామిశెట్టి, అమెరికా నుండి కళ్యాణి పత్తి, సింగపూర్ నుండి చోడసాని ప్రసాద్, పవన్ కుమార్ మర్రి, సౌత్ కొరియా నుండి నాగ వంశీకృష్ణ తిరుమలశెట్టి, డా.నవీన్ కుమార్, న్యూజిలాండ్ నుండి సాయిరాం తోట, స్వీడన్ నుండి రాజా తమ్మిశెట్టి, శ్రీహర్ష వాసా, బెల్జియం నుండి ప్రవీణ్ జాగురుమిల్లి, కెన్యా నుండి ప్రవీణ్ మొగసాటి మరియు అమల చలమలశెట్టి తదితరులు పాల్గొన్నారు.