రాజ్యాంగ దినోత్సవ వేడుకలు చేసేందుకు సీఎం జగన్ అనర్హులు: పోతిన మహేష్

  • రాజ్యాంగ దినోత్సవం అంటే పథకాలు పేర్లు చదవడమా?

విజయవాడ వెస్ట్: రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ మరియు నాయకులు. అనంతరం మహేష్ మాట్లాడుతూ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం రోజున సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక మోసం చేస్తూ.. సామాజిక న్యాయమంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, రాజ్యాంగ దినో త్సవ వేడుకలు చేసేందుకు సీఎం జగన్ అనార్హులని, జగన్ గారి పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, పాలనలో దోపిడీ విధ్వంసం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ చట్టాల్ని ధిక్కరిస్తున్నారని, రాజ్యాంగ దినోత్సవం అంటే పథకాలు పేర్లు చదవడమాని, ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడం మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న చర్యలు తీసుకోకపోవడం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవడం ఇదేనా జగన్ గారు మీ పాలనలో సాధించినది అని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పై నిజంగా తమరికి గౌరవం ఉంటే విదేశీ విద్యా పథకానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పేరుని తొలగించి వారా?కోనసీమ జిల్లాకు అంబేద్కర్ గారి పేరును పెట్టే సమయంలో ఘర్షణలకు దారి తీశాయి కానీ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును తొలగించి వైయస్సార్ యూనివర్సిటీ గా పేరు మార్చినప్పుడు ఎటువంటి ఆందోళన జరగలేదు అంటే దళిత వర్గాలను బహుజనులను బలహీన వర్గాల మధ్య సెంటిమెంట్ రేకెత్తించి రాజకీయ లబ్ధి పొందడమేనా తమరు అంబేద్కర్ గారికి ఇచ్చే నివాళి అని, బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలను ఏ మారుస్తూ వారిని కేవలం నామినేటెడ్ పదవులకే పరిమితం చేస్తూ ఓటు బ్యాంకుగా వాడుకుంటూ మోసం చేస్తున్నారని జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న మోసాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలు ఇప్పటికే గ్రహించారని రాబోయే ఎన్నికల్లో తప్పక వైసిపికి బుద్ధి చెప్తారని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు నేడు జీవించి ఉంటే వారి రాసిన రాజ్యాంగం ద్వారా సీ.ఎం జగన్ లాంటి క్రిమినల్స్ అధికారంలోకి వచ్చి నందుకు తీవ్రంగా విచారించే వారన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధికార ప్రతినిధి స్టాలిన్ శంకర్, నగర కమిటీ ప్రధాన కార్యదర్శి మోబినా, కార్యదర్శులు బొట్ట సాయి, సబింకర్ నరేష్, 53వ డివిజన్ అధ్యక్షులు పొట్నూరి శ్రీనివాసరావు, పులిచేరి. రమేష్, బావిశెట్టి శ్రీనివాస్, నోచర్ల పవన్ కళ్యాణ్, మరుపిల్ల చిన్నారావు, చొక్కార నగేష్, సోమీ మహేష్ లు పాల్గొన్నారు.