చీమలపాడు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి: ఖమ్మం జనసేన డిమాండ్

ఖమ్మం జిల్లా, ఖమ్మం నగరంలో గల ప్రెస్ క్లబ్ నందు జనసేన పార్టీ నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన ఖమ్మం అసెంబ్లీ కోఆర్డినేటర్ రామకృష్ణ మిరియాల మాట్లాడుతూ చీమలపాడులో జరిగిన సంఘటన తీవ్ర విషాదకరం, ఈ ఘటనపై ఖమ్మం జిల్లా జనసేన పార్టీ తరుపున సంతాపం వ్యక్తం చేస్తున్నాము. ఈ ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్న కారకులు ఎవరు అనేది ఎందుకు తేల్చలేదు? అసలు వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? నిందితులను పట్టుకోవడంలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది అని ప్రశ్నించారు. ఈ ఘటన పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసారా, ఒక వేళ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినా ఎందుకు కేసు వివరాలు బయటకు చెప్పడం లేదు ? అంత గోప్యంగా ఉంచాల్సిన పరిస్థితి ఏముంది? ప్రభుత్వంలో ఉన్న బి.ఆర్.ఎస్ పెద్దలే ఇందులో కుట్ర దాగివుంది అని చెప్తున్నారు, అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయడంలేదు. ఎంపి/ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు వచ్చే సభలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లుతో పాటు సభ ప్రాంగణంలో ఫైర్ ఇంజన్, అంబులెన్స్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఇది భద్రతాలోపం కాదా అని ప్రశ్నించారు. అసలు ఈ ఘటనపై ముందుగా ఎంపి/ఎమ్మెల్యే పై కేసు నమోదు చేసి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. ఇంతటి ఘటనకు కారణంఐనా సభకు అసలు పర్మిషన్ ఉందా, ఉంటే పర్మిషన్ కోసం ఇచ్చిన దరఖాస్తులో ఉన్న వ్యక్తులపై ఎందుకు కేసు నమోదు చేయలేదు. అలాగే బాధిత కుటుంబాలకు 50లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా మరియు ప్రభుత్వ ఉద్యోగం, మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని ఈ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ పరిహారాన్ని వెంటనే బాధితులకు అందజేయాలని కోరుతున్నాం లేని పక్షంలో భాదిత కుటుంబాలతో ప్రభుత్వంపై జనసేన పార్టీ తరుపున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. అదే విధంగా జగన్మోహన్ మిరియాల మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉండి పోరాడతాం అని తెలిపారు. అదే విధంగా అశ్వారావుపేట కో ఆర్డినేటర్ డేగల రామచంద్రరావు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు మిరియాల జగన్ మోహన్, డేగల రామచంద్రరావు, మేడబోయిన కార్తీక్, యాసంనేని అజయ్ కృష్ణ, కట్టా రామకృష్ణ, పుల్లారావు, తాళ్లూరిడేవిడ్, ఖమ్మం నగర నాయకులు విజయకుమారి, దేవేందర్, స్రవంత్, శ్రీకాంత్, హరి, రాకేష్, ఉపేందర్, వరప్రసాద్, నాగుల్ మీరా, సతీష్, నరసింహారావు, ఆథిక్, బాలకృష్ణ, నవీన్, నాగరాజు, మనోజ్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.