పెన్షన్ రాని వితంతు మహిళకు గుంతకల్ జనసేన నాయకుల ఆర్థిక సహాయం

  • పెన్షన్లు ఇవ్వాలంటే పాతవి కోయాల్సిందేనా..? అంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ

గుంతకల్ (అర్బన్) ధోని ముక్కల రోడ్డు కస్తూరిబాయి స్కూల్ వెనకాల నివసిస్తున్న వితంతువు నాగలక్ష్మి పెన్షన్ ఈనెల కోత విధించారు స్థానిక జనసైనికుల ద్వారా విషయం తెలుసుకున్న గుంతకల్ జనసేన నాయకులు బాధితురాలిని పరామర్శించి కారణం తెలుసుకోగా రేషన్ కార్డులో భర్త పేరు నమోదుగా ఉండటం వల్ల పెన్షన్ తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్, సచివాలయ సిబ్బంది డోర్ టు డోర్ తనిఖీ చేసి వారి భర్త పేరును వారే తొలగించాల్సి ఉండగా ఆ పని చేయకుండా అశ్రద్ధ వహించి బాధితురాలికి పెన్షన్ రాకుండా కారణమయ్యారని అర్థమయింది.

ఈ సందర్భంగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క అదనపు పెన్షన్ కూడా పెంచకుండా పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని, అడ్డగోలు నిబంధనలుతో ఉన్న పెన్షన్లు తీసివేశారు ఎన్ని దరఖాస్తులు వస్తే అన్ని పాత పెన్షన్ లు తొలగిస్తున్నారని ఏది ఏమైనా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాబోయే రోజుల్లో అర్హులైన అందరికీ పెన్షన్ ఇవ్వాలి లేనిపక్షంలో జనసేన పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతుందని ప్రభుత్వ అధికారులను, ప్రజాప్రతినిధులను హెచ్చరించారు.
పెన్షన్ రాని బాధితురాలు నాగలక్ష్మి కుటుంబానికి సహాయంగా జనసేన పార్టీ అండగా 5 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి మీ పాత పెన్షన్ వచ్చే వరకు అధికారులపై ఒత్తిడి చేస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్, జిల్లా కార్యనిర్వాహక కమిటీ సభ్యులు పవర్ శేఖర్, శ్. కృష్ణ, పట్టణ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్ నిస్వార్థ జనసైనికులు వెంకటేష్, దాదు, ముత్తు, ఆటో రామకృష్ణ, మంజు, ఎం. సత్తి, రంగా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *