బాధిత కుటుంబాలకు జ్యోతుల శ్రీనివాసు ఆర్థిక సహాయం

  • బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు & జ్యోతుల గంగాభవానీ చైర్మన్, సాయిప్రియ సేవాసమితి

పిఠాపురంనియోజవర్గం: గొల్లప్రోలుమండలం, దుర్గాడ గ్రామంలో ఇరు కుటుంబాలకు జ్యోతుల శ్రీనివాసు దంపతులు ఆర్థికసహాయం అందించారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాల వారు కష్టాల్లో ఉన్నప్పుడు మాకు ఎవరైనా బాధిత కుటుంబాల పరిస్థితులు గూర్చి తెలియజేస్తే నేను సకాలంలో స్పందించి కుల, మత, వర్ణ వర్గాలకు అతీతంగా బాధిత కుటుంబాలకు నాకు తగినసహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలియజేస్తూ.. బాధిత కుటుంబాలకు ఈ సంక్రాంతి రోజున సహాయం అందించి వారికి సంక్రాంతిశోభను తేవడం జరిగిందని జ్యోతుల శ్రీనివాసు తెలియజేశారు.
1 )చేశెట్టి సత్యనారాయణ అకాల మరణం కారణంగా వారి కుటుంబం ఆర్దికపరిస్దితుల బాగాలేదని కాలనీ చెందిన జనసైనికులు చేశెట్టి భద్రం,మంతిన గణేష్,వట్టూరి శ్రీను జనసేననాయకులు& సాయిప్రియ సేవాసమితి,వ్యవస్దస్దాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసుకు తెలియజేయగా వెంటనే జనసేన నాయకులు&సాయిప్రియ సేవాసమితి,వ్యవస్దస్దాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు వెంటనే స్పందించి స్వర్గీయ చేశెట్టి సత్యనారాయణ స్వగ్రామానికి కాలనీ పెద్దలు, జనసైనికులతో కలిసి వెళ్ళి చేశెట్టి సత్యనారాయణ భార్య చేశెట్టి సరోజికి కాలనీ పెద్దలు, జనసైనికులు సమక్షంలో రూ:5000/- అక్షరాల ఐదు వేలరూపాయిలు ఆర్దిక సహయం జనసేన నాయకులు&సాయిప్రియసేవాసమితి, వ్యవస్దస్దాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు, చైర్మన్ జ్యోతుల గంగాభవానీ కలిసి అందించారు.
2) జాగు వీరబాబు అకాల మరణం కారణంగా వారి కుటుంబం ఆర్దికపరిస్దితుల బాగాలేదని కాలనీ చెందిన జనసైనికులు చేశెట్టి భద్రం, మంతిన గణేష్ జనసేన నాయకులు&సాయిప్రియసేవాసమితి, వ్యవస్దస్దాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసుకు తెలియజేయగా వెంటనే జనసేననాయకులు&సాయిప్రియసేవాసమితి, వ్యవస్దస్దాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు వెంటనే స్పందించి స్వర్గీయ జాగు వీరబాబు స్వగృహానికి కాలనీ పెద్దలు, జనసైనికులతో కలిసి వెళ్ళి జాగు వీరబాబు భార్య జాగు సత్యవతి కి కాలనీ పెద్దలు, జనసైనికులు సమక్షంలో రూ. 5000 అక్షరాల ఐదువేలరూపాయిలు ఆర్దిక సహయం జనసేననాయకులు &సాయిప్రియసేవాసమితి, వ్యవస్దస్దాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు, చైర్మన్ జ్యోతుల గంగాభవానీ అందించారు. పైన తెలియజేసిన కార్యక్రమాలలో శాఖ సురేష్, బండారు కృష్ణ, మంతెన గణేష్, చేశెట్టి భద్రం, పేకేటి వెంకటరమణ, వట్టూరిసూరిబాబు, చేశెట్టిగోవిందరాజు, వట్టూరి నవీన్, శేశెట్టిలోవరాజు, నీలం జోగిరాజు, చేశెట్టి బాబ్జి, వానపల్లి మణికంఠ, అడబాల బాలరాజు, చేశెట్టి ఈశ్వరరావు, జగ్గారపు దుర్గాజీ, జగ్గార్పు అమ్మాజీ, ఆలేటి కుమారి, బొమ్మిడి అమ్మాణి తదితరులు పాల్గొన్నారు.