ప్రచారంలో దూసుకుపోతున్న జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం నందు హరేరామగుడి వద్ద నుండి జనసేన-తెలుగుదేశం-బిజెపి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పిఠాపురం శాసనసభ నియోజకవర్గం నుండి జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీల ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న కొణిదల పవన్ కళ్యాణ్ కు, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి జనసేన-తెలుగుదేశం-బిజెపి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ కి మద్దతుగా చేబ్రోలు గ్రామంలో హరేరామగుడి వద్ద నుండి ప్రచారం ప్రారంభించి ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహించారు. ముందుగా హరేరామగుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి, హరేరాముడుని దర్శించుకొని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు, పిఠాపురం నియోజకవర్గ జనసేన కమిటీ సభ్యులు ఓదూరినాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ గొల్లప్రోలు మండల అధ్యక్షులు వలవకాయల దేవేంద్రుడు, తెలుగుదేశం నాయకులు ఓరుగంటి నానాజీ, మల్లిపూడి వీరబాబు, నక్కా ఆనంద్, గొల్లప్రోలు మండల జనసేన ప్రసార కమిటీ సభ్యులు ఓరుగంటి రఘు, చేదులూరి త్రిమూర్తులు అధ్యక్షతన ప్రచారం ప్రారంభించారు. అనంతరం చేబ్రోలు గ్రామంలో గల హరేరామగుడి ఏరియా, మిల్లు గరువు, 1వ వార్డు, 2వ వార్డు ఏరియాలలో ఇంటిఇంటికి వెళ్ళి జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు జనసైనికులు చేబ్రోలు గ్రామంలో గల ఓటర్లు గాజుగ్లాసు పై ఓటు వేసి జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని,కాకినాడ పార్లమెంటు సభ్యునిగా ఉదయ్ శ్రీనివాస్ ని గెలిపించుకొంటే పిఠాపురం నియోజవర్గాన్ని ఎలా అభివృద్ధి చేసుకొవచ్చో మేనిపెస్టో పాంప్లెట్ ను ఓటర్లకు అందజేసి తెలియజేశారు.
రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో చేబ్రోలు గ్రామ ఓటర్లులను తమకు గల 2 ఓట్లును గాజుగ్లాసు గుర్తులపై వేసి పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యునిగా కొణిదల పవన్ కళ్యాణ్, కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించమని కోరుతూ కరపత్రాలను పంపిణీ చేస్తూ వ్యక్తిగతంగా ప్రతి ఓటరుని కలిసి ప్రచారం నిర్వహించారు.‌ ఈ కార్యక్రమంలో మట్ల సత్తిబాబు, గంటా గోపి, నల్లరావుల ఏసుబాబు, బత్తుల శ్రీను, ఓరుగంటి వీరబాబు, పెద్దింటి శివ, యర్రంశెట్టి అప్పాజీ, ఓరుగంటి వీరబాబు, గాజుల గోవిందు, పేపకాయల వెంకటరమణ, నక్క తాతీలు, శివలింక నాగబాబు, ఉలకాయల స్వామి, దిబ్బడి సురేష్, చేదులూరి గవ్రరాజు, ఉమ్మిడి వాసు, వులవల శ్రీను, చేదులూరి శ్రీను, సఖినాల లచ్చబాబు, నక్కా గంగరావు, చల్లా ఈశ్వరరావు, వులవల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.