పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమానికి తరలి వెళ్ళిన జ్యోతుల

పిఠాపురం నియోజవర్గం: శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా జనసేన, తెలుగుదేశం, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయుచున్న కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రచారం కార్యక్రమంలో పాల్గొనుటకు జిల్లాజనసేన కార్యదర్శి & పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు స్వగ్రామమైన దుర్గాడ గ్రామం నుండి భారీ బైక్ ర్యాలీతో బయలుదేరి వెళ్ళుటకు జనసేన, తెలుగుదేశం, బిజెపి జండాలను ఊపి ర్యాలీని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ర్యాలీగా జ్యోతుల శ్రీనివాసు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులతో కలిసి చేబ్రోలు జనసేనాని నివాసానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం అయిందని కానీ భారీ మెజార్టీ దిశగా జనసేన, తెలుగుదేశం, బిజెపి కేడర్ పనిచేస్తుందని కాబట్టి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం గ్యారెంటీ అని ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు తెలియజేశారు. అనంతరం జ్యోతుల శ్రీనివాస జనసేనాని పవన్ కళ్యాణ్, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్, టిడిపి ఇన్చార్జి యస్.వి.వి యమ్ వర్మ, బిజెపి ఇన్చార్జి బుర్రా కృష్ణంరాజు యితర నాయకులతో, జనసైనికులు, వీరమహిళలతో కలిసి బయలుదేరి చెందుర్తి, వన్నెపూడి, కొడవలి జంక్షన్ మీదుగా వెల్దుర్తి తదితర ప్రాంతాలలో జరిగే ప్రచార కార్యక్రమానికి బయలుదేరి వెళ్ళారు. పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గాడ గ్రామ జనసేన నాయకులు & దుర్గాడ జిల్లా పరిషత్ హై స్కూల్ చైర్మన్ కందా శ్రీనివాస్, జనసేన మండల ప్రచార కమిటి సభ్యులు ఇంటి వీరబాబు, గొల్లపల్లి శివబాబు, శాఖ సురేష్, వట్టూరి శ్రీను, దడాల రాజబాబు దుర్గాడ గ్రామ జనసేన సీనియర్ నాయకులు దంగేటి నాగేశ్వరరావు, రావుల తాతారావు, దేశిలింక బాస్కరరావు, మేడిబోయిన సత్యనారాయణ, మొగిలి శ్రీను, జ్యోతుల సీతరాంబాబు, సఖినాల రాంబాబు, చేశెట్టి భద్రం, సాధనల చంటిరాము, కాపారపు వెంకటరమణ, కొప్పల చక్రదర్, పోలం త్రిమూర్తులు, జ్యోతుల గొపి, యండపల్లి నరేష్, అయినవిల్లి రాజు, జ్యోతుల వాసు, కొలానారాయణరావు, జీలకర్ర బాను, మంతెన గణేష్, నేమాల కన్నయ్య, ఆకులవెంకటస్వామి, జ్యోతుల వీరబాబు, అయినవిల్లి రామకృష్ణ, ములగపాటి ప్రకాష్, శివకొటి వెంకటరమణ, విప్పర్తి శ్రీను, పెదపాటి అప్పలస్వామి గొల్లు సునీల్ కుమార్, శివకోటి‌‌ అర్జునుడు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.