జనసేన పార్టీ అడ్ హక్ కమిటీలో రెడ్డి బాలకృష్ణ నియామకం

రాజాం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, రాజాం నియోజకవర్గానికి రెడ్డి బాల మురళీ కృష్ణను అడ్ హాక్ కమిటీలో నియమించడం జరిగింది. ఈ సందర్భంగా బాల మురళీ కృష్ణ మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు శ్రీ పిసిని చంద్రమోహన్ గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ యు.పి. రాజు గారికి మరియు నాకు అండగా నిలిచిన నా జనసేన కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదములు అని తెలియచేశారు.