నాదెండ్ల మనోహర్ కు జన్మదిన శుభాకాంక్షలు: మనోజ్ కుమార్

పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మనోజ్ కుమార్ నిజాయితీగల పార్టీలో పని చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది మరియు ఆనందంగా ఉందని తెలియ జేశారు. ఎటువంటి అధికారం లేకపోయినా ప్రజల మీద పవన్ కళ్యాణ్ గారికి మరియు నాదెండ్ల మనోహర్ గారికి ఉన్నటువంటి ప్రేమ మరియు అభిమానం వెలకట్టలేనిది, అధికారంలో ఉన్నవారు కూడా చేయలేని పనులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, ఆత్మహత్య చేసుకున్న ఒక్కొక్క రైతు కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 5 కోట్లు ప్రకటించడం ఎంతో గొప్ప విషయం, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా.. రైతులను పట్టించుకోకుండా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారు, ఈ రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ ఎప్పుడు అండగానే ఉంటుంది. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే పొన్నలూరు మండలాన్ని మన జిల్లాలోనే ఆదర్శవంతమైన మండలంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు.