అధికారిక హామీ మేరకు దీక్ష విరమింపజేసిన కందుల దుర్గేష్

జగ్గంపేట నియోజకవర్గం, గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో విద్యుత్ శాఖ వారు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలపై జగ్గంపేట ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర గత 4 రోజులుగా చేపట్టిన సామూహిక ఆమరణ నిరాహారదీక్షకు సంఘీభావం తెలుపుతూ జిల్లా కలెక్టర్ మరియు విద్యుత్తు శాఖ వారిని సంప్రదించి… అచ్యుతాపురం గ్రామ ప్రజల డిమాండ్లపై లిఖితపూర్వక హామీ కోసం శ్రమించి, అధికారిక హామీ ఇచ్చిన నేపద్యంలో దీక్షలో పాల్గొన్న నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేసిన జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్.