మంగళగిరిలో కాపు సంక్షేమ సేన కార్యకర్తల సమావేశం

మంగళగిరిలో ఆదివారం కాపు సంక్షేమ సేన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశము మంగళగిరి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు తిరుమలశెట్టి కొండలరావు అధ్యర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి గుంటూరు జిల్లా కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు బండికల్లు శ్యామ్ ప్రసాద్ హాజరైనారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటం జరుగుతుంది, కనుక ఈ రెండు నెలలు మనమందరం పటిష్టంగా పనిచేసి జనసేన, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుటకు విశేషంగా కృషి చేసి పవన్ కళ్యాణ్ కి బహుమతిగా ఇవ్వాలని శ్యామ్ ప్రసాద్ అన్నారు. రాజధానిలో రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఏండకడుతూ మన ఉమ్మడి మానిఫెస్ట్ విధివిధానాలను ప్రజలకు చేరువ అయ్యే విధంగా మన నాయకులు, కార్యకర్తలు సుశిక్షితులైన వుండాలని అయిన కోరడం జరిగింది. మన రాష్ట్ర అధ్యక్షులు చేగొండి హరిరామజోగయ్య ఆశయాలకు అనుగుణంగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం ఉమ్మడి మానిఫెస్టోలోని విధివిధానాలను వారికి సవివరంగా తేలియజేసి మన పార్టీని విజయపథంలో నడిపించాలని అన్నారు. అనంతరం కాపు సంక్షేమ సేన మంగళగిరి నియోజకవర్గంలో నూతన నియామక పత్రాలను శ్యామ్ ప్రసాద్ అందజేసినారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ని మంగళగిరి కమిటీ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, జనసేనపార్టీ ఐటి వింగ్ నాయకులు చవ్వాకుల కోటేశ్వరరావు, కాపు సంక్షేమ సేన జిల్లా కార్యదర్శి ప్రతివాడ గంగాధరరావు, యూత్ వింగ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఓమ్ కోటేశ్వరరావు, కాపు సంక్షేమ సేన మంగళగిరి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి కాపురౌతుర సుందరయ్య, మంగళగిరి పట్టణ కాపు సంక్షేమ సేన అధ్యక్షులు దుర్గారావు, మంగళగిరి రూరల్ మండల అధ్యక్షులు అప్పికట్ల నాగేశ్వరరావు, తాడేపల్లి అధ్యక్షులు పెద్ధినేని వేణు, జనసేన నాయకులు చిట్టెం అవినాష్, పసుపులేటి శ్రీనివాసరావు, బాణాల నాగేశ్వరరావు, దాసరి వెంకటేశ్వరరావు, గంధం సుబ్బారావు, సోషల్ మీడియా అధ్యక్షులు గుర్రాల వేణు, మంగళగిరి మండల జనసేన పార్టి అధ్యక్షులు సామన కోటేశ్వరరావు, మరియు కాపు పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.