కావలి జనసేన వీరమహిళా విభాగ సమీక్ష సమావేశం

కావలి నియోజకవర్గం: వెంగల్ శెట్టి కళ్యాణి ఆధ్వర్యంలో శనివారం జనసేన వీరమహిళా విభాగ సమీక్ష సమావేశంలో భాగంగా జనసేన పార్టీలో దాదాపుగా 150 మంది మహిళలు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి మరియు కావలి ఇన్చార్జి సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. కావలి నియోజకవర్గం ఇంత మంది మహిళా కార్యకర్తలతో పార్టీలో ఆనందంగా ఉంది. స్థానిక సమస్యలపై పోరాడేందుకు జనసేన సిద్ధంగా ఉంది. మీ మద్దతుతో జనసేన టిడిపి జనసేన ప్రభుత్వాన్ని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. కావలి జనసేన ఇంచార్జ్ అళహరి సుధాకర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా ఉంది. నియోజకవర్గంలో ఎన్ని సమస్యలున్నా కూడా పట్టనట్టున్న ప్రతాపరెడ్డికి ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ మహిళా సాధికారత జనసేన తోనే సాధ్యం, మధ్యతరగతి మహిళలు ఈ వైసిపి వలన కష్టనష్టాలు తెలిసి ఉన్నాయి. రాజకీయాల్లోకి మహిళలు రావాల్సిన ఆవశ్యకత ఉంది. అందరికంటే ముందుగా ఈ విషయాన్ని ప్రస్తావించింది పవన్ కళ్యాణ్ గారే.. ఎంత రెవెన్యూ వచ్చినా దానిని కుటుంబ మొత్తానికి సరిపోయేటట్టు చేయగల సత్తా ఉన్న మహిళలు రాజకీయాల్లోకి వస్తే మరింత మేలు చేకూరుతుందని తెలిపారు. వారం రోజుల వ్యవధిలోనే జనసేన పార్టీ పైన మక్కువతో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కళ్యాణి గారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కళ్యాణి గారు మాట్లాడుతూ దాదాపు కావలి నియోజకవర్గంలో తమ 500 పైబడి బంధువులు కుటుంబాలు జనసేన మద్దతుగా ఉన్నారని. స్థానిక సమస్యలపై జనసేన పార్టీ తరఫున నిలబడి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏదైనా కానీ ప్రజా ప్రభుత్వానికి ఏర్పాటు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్, కావలి నియోజకవర్గం ఇన్ చార్జ్ సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా అధికార ప్రతినిది కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు రవి, జనసేన నాయకులు నలిశెట్టి శ్రీధర్, కావలి పట్టణ అధ్యక్షులు పొబ్బా సాయి, హరి రెడ్డి, కేఎసెస్ఎస్ జిల్లా అధ్యక్షులు సుధా మాధవ్, నియేజక వర్గ ఇన్చార్జ్ శ్రీధర్, వీరమహిళ భవాని కళ్యాణి, గౌసున్నీసా, శిరీష, మనియమ్మ తదితర మహిళలు జనసేన నాయకులు వెంకీ, సుధీర్, శ్రీనాధ్, ఋషి, ప్రవీణ్ పాల్గొన్నారు.