కెసిఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి: జనసేన పార్టీ డిమాండ్

నిర్మల్, భారత రాజ్యాంగాన్ని మార్చాలని అనాలోచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కొరుతు నిర్మల్ జిల్లా, భైంసా పట్టణంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జనసేన నాయకులు ఫ్లకార్డుల ప్రదర్శన చేసి, అఖిల పక్షం ఆధ్వర్యంలో కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేయటం జరిగింది, తదుపరి ర్యాలిగా బయలుదేరి రాజస్వ మండల అధికారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జన సేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చడం కాదు కెసిఆర్ నిన్నే మర్చెస్తాం. ముందు నీ అవినీతి ఎమ్మెల్యే మంత్రులను నీ కుటుంబ సభ్యులను పదవుల నుండి మార్చు, లేదంటే వాళ్ళని రోడ్డు మీద తిరగ నివ్వకుండ నిర్భందించి అఖిలపక్షం సత్తా చూపిస్తాం. మీరు చేసిన అనాలోచిత వ్యాఖ్యలు ప్రజలు గమనిస్తున్నారు. భవిష్యత్ లో తెరాస పార్టీని గెలవనివ్వకుండ దళిత బహుజన బడుగు బలహీన వర్గాలు ఐక్యంగా ఉండి సామాజిక తెలంగాణ సాధన కోసం ముందుకు సాగుతాం అని తెలిపారు.