ఘనంగా కిరణ్ రాయల్ జన్మదిన వేడుకలు

  • జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ శుభాకాంక్షలు తెలియజేశారు

తిరుపతి నియోజకవర్గం: తిరుపతిలోని కిరణ్ నివాసం వద్ద ఆదివారం ఆయన 41వ పుట్టినరోజు వేడుకలు కార్యకర్తలతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఉమ్మడిచిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, తెలుగుదేశం నాయకులు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, వూక విజయకుమార్, పులిగోరు మురళి, మరియు బీజేపీ నాయకులు సైకం జయచంద్ర రెడ్డి, భానుప్రకాశ్ రెడ్డి, కోలా ఆనంద్, సామంచి శ్రీనివాసులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు, తిరుపతిలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు, టీటీడీ సంఘాల ఉద్యోగస్తులు మరియు స్థానిక ప్రజలు పుష్పగుచ్చాలు, శాలువాలతో కిరణ్ రాయల్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.