మెగాస్టార్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో – సజ్జలకు జయరాం రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

అనంతపురం: సజ్జల రామకృష్ణారెడ్డి పద్మ భూషణ్, పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడండి. చిరంజీవి గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోం, మీరు మాట్లాడిన ప్రతి మాటకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకొక తప్పదు. ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ, ప్రజాసంపదని ప్రతినెల జీతం రూపంలో తీసుకుంటూ రాజకీయ పార్టీలకు అనుకూలంగా మాట్లాడడం ఎంతవరకు సబబు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ప్రభుత్వ సలహాదారులు ఎవరు? ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడకూడదు అని స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా మీరు వైసీపీ పక్షాన మాట్లాడడం నీచమైన చర్య! హేయమైన చర్య!! వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రజా హక్కులను కలరాస్తూ! వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ!! రాష్ట్రంలో ఎవరు స్వేచ్ఛగా మాట్లాడడానికి వీలు లేదు? ఎవరైనా తమ అభిప్రాయం బహిర్గతంగా చెప్పకూడదు? మా మాట కాదని అభిప్రాయం చెబితే మేము భయపెడతాం? బెదిరిస్తాం? మానసికంగా హింసిస్తాం? భౌతిక దాడులు చేస్తాం? చంపేస్తాం? అంటే మేము చూస్తూ ఊరుకోం!! మీ దౌర్జన్యాలు, దోపిడీలు, దురాగతాలని మేము ఇంకా భరించడానికి సిద్ధంగా లేము? జరగబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మీకు తగిన గుణపాఠం నేర్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకోండి. రాష్ట్రంలో గుంటనక్కల్లాగా రాజకీయ వ్యవహారాలు చేస్తూ? రాబందులు లాగా? పందికొక్కుల్లాగా? ప్రజాసంపదని, ప్రకృతి వనరుల్ని దోచుకుంటున్నది మీరు, మీ ముఠా కాదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు? చిరంజీవి గారు తనకు కావాల్సిన వ్యక్తులు కలిస్తే తన మద్దతును ప్రకటించినందుకు తప్పుడు మాటలు మాట్లాడుతూ, చులకన చేస్తూ, మానసికంగా వేధించాలనుకుంటే చూస్తూ ఊరుకోమని తెలియజేస్తున్నాం.