కేజ్రీవాల్ మరో సంచలన నిర్ణయం.. మార్కెట్లలో లాక్‌డౌన్‌

ఢిల్లీలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి ఢిల్లీలో లాక్‌డౌన్ విధిస్తారని పుకార్లు బయటకు వచ్చాయి. అనంతరం లాక్ డౌన్ ఉండదు అంటూ ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. కానీ కేసుల సంఖ్యను అదుపులో ఉంచాలంటే మార్కెట్లను మూసివేయాలని ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఈరోజు ఆయన కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. కేంద్ర ప్రభుత్వానికి ఓ వినతి పంపిస్తున్నామని, ఒకవేళ వీలైతే, కొన్ని రోజుల పాటు ఢిల్లీలో మార్కెట్లను మూసివేయనున్నట్లు తెలిపారు. కోవిడ్ ఆంక్షలను పాటించని ప్రదేశాలు.. లోకల్ ట్రాన్స్‌మిషన్‌కు సెంటర్లుగా మారుతున్నాయని సీఎం చెప్పారు. ఢిల్లీ హాస్పిటళ్లలో 750 ఐసీయూ మంచాలను పెంచినందుకు కేంద్ర ప్రభుత్వానికి కేజ్రీ థ్యాంక్స్ చెప్పారు. వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వ ఏజెన్సీలన్నీ పనిచేస్తున్నాయని, కానీ కోవిడ్‌19 నివారణలో ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టాన్సింగ్ కూడా పాటించాలని సీఎం కేజ్రీ కోరారు.

కరోనా తిరిగి విజృంభిస్తుండటంతో కేజ్రీవాల్ మరోసారి పాత నియమాలను అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మొదటగా పెళ్లిల్లకి, ఫంక్షన్‌లకు 50 మందికి మించి హాజరుకాకూడదన్న నిబంధన తెలిసిందే. అయితే తరువాత దానిని కాస్తా మార్చి దాదాపు 200 మంది వరకూ పెంచగా..  కరోనా తిరిగి విజృంభిస్తుండటంతో కేజ్రీవాల్ మరోసారి పాత నియమాలను అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా మొదట పెళ్లిల్లకు హాజరయ్యేవారి సంఖ్య 50 కన్నా తక్కువగానే ఉండాలని ఖరారు చేశారు. మునపటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని, ఇకపై కరోనా నిబంధనలను పాటించని వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలోని గాలి కాలుష్యంపై కూడా ఆయన ప్రస్తావించారు.