ప్రైవేట్ స్కూల్స్ విషయంలో జగన్ కఠిన నిర్ణయాలు

జగన్ సర్కారు ప్రైవేట్ పాఠశాలల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయులకు వృత్తికి సంబంధంలేని పనులు చెయ్యొద్దు అంటూ జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా అయితే ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు అందరూ తమ పాఠశాలలో అడ్మిషన్లు ఎక్కువగా తీసుకోవడానికి ఏకంగా ఇంటింటికి తిరుగుతూ విద్యార్థుల తల్లిదండ్రులను ప్రాధేయ పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక అలా ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ ఉండటం వల్ల విద్యార్థుల తల్లిదండ్రుల్లో కాస్త చులకన బావం ఏర్పడుతూ ఉంటుంది అయితే ఇటీవలే ఈ విషయం పై కీలక ఆదేశాలు చేసిన జగన్ సర్కార్ దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయులకు సంబంధం లేని పనులు చెప్పకూడదు అంటే ఆదేశించింది.

అడ్మిషన్ల కోసం విద్యార్థులకు విద్యా బోధన చేసే ఉపాధ్యాయులను విద్యార్థుల ఇంటికి పంపవద్దు అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఎవరైనా తమ పాఠశాలలో పిల్లలను చేర్చాలంటు ఇంటికి వస్తే.. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటూ తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.