టీడీపీ, వైసీపీకి చెందిన కీలకనేతలు జనసేన పార్టీలో చేరిక

  • వరస చేరికలతో రాజానగరం నియోజకవర్గంలో జనసేన ప్రభంజనం
  • తీన్మార్ డప్పులతో, పెద్ద ఎత్తున బాణసంచా పేల్చుతూ, పూలవర్షం కురిపిస్తూ యువత కేరింతలతో చక్రాద్వారబంధం గ్రామంలో “బత్తుల” దంపతులకు ఘనస్వాగతం లభించింది
  • టీడీపీ నియోజకవర్గ సీనియర్ నేత సోడసాని శ్రీనివాసరావు (చక్రద్వారబంధం) జనసేన పార్టీలో చేరిక
  • చక్రద్వారబంధం గ్రామంలో కీలక టిడిపి, వైసిపి నేతలు, కార్యకర్తలు సుమారు 250 మంది జనసేన పార్టీలో చేరిక.. (50 మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన టిడిపి కార్యకర్తలు)
  • పూర్తిగా జనసేన పార్టీకి ఏకపక్షమైన చక్రద్వారబంధం గ్రామం
  • నిర్విరామంగా నియోజకవర్గంలో ఏదోమూల ఇతర పార్టీల నుండి జనసేన పార్టీలో చేరుతున్న నేతలు, కార్యకర్తలు.. జనశ్రేణుల్లో నూతన ఉత్సాహం
  • నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ కు ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఇతర పార్టీల నుండి జనసేన పార్టీలోకి పెరుగుతున్న వలసలు
  • రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు, నియోజకవర్గంలో ఎన్నికలకు ముందే ప్రత్యర్థులు చేతులెత్తేసే పరిస్థితి

రాజానగరం నియోజకవర్గం: రాజనగరం మండలం, చక్రద్వారబంధం గ్రామంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నియోజకవర్గ టిడిపి సీనియర్ నేత, ఎన్నో గ్రామాల్లో రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి సోడసాని శ్రీనివాసరావు వారి అనుచరులు 250 మంది (50 బీసీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు) జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు, విలువలతో ఆయన పార్టీని నడిపిస్తున్న తీరు అలానే రాజానగరం నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పేదల పెన్నిధిగా, సేవాతత్పరుడు పేరుగాంచిన జనసేన పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జ్ బత్తుల బలరామకృష్ణ గారి నాయకత్వం, వారు చేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలు, నియోజకవర్గ ప్రజా సమస్యలపై పోరాడుతున్న తీరు నచ్చి టీడీపీ, వైసీపీ కీలక నేతలు, కార్యకర్తలు సుమారు 250 మంది జనసేన పార్టీలో చేరారు. వారందరినీ సాధర పూర్వకంగా ఆహ్వానిస్తూ జనసేన కండువా వేసి బత్తుల బలరామకృష్ణ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. రాజానగరం నియోజకవర్గంలో ఇతర పార్టీల నుండి వరుస చేరికలతో దూసుకుపోతున్న జనసేన పార్టీ ప్రభంజనానికి అడ్డుకట్ట వేయాలని ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు చెప్పిన మాట ప్రకారం జనసేన పార్టీలో చేరిన సోడసాని శ్రీనివాసరావు, ఇతర నేతలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. మంచి సమాజం కోసం పరితపిస్తున్న పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడిచి, భావితరాల భవిష్యత్తు కోసం మంచి సమాజాన్ని నిర్మిద్దామని, పార్టీలో నేతలకు, కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు ఎవరికీ ఏ కష్టం వచ్చినా తనకు వెంటనే ఫోన్ చేయాలని, ఎలాంటి ఇబ్బంది అయినా ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉన్నానని, పూర్తి సమయం పార్టీకే కేటాయిస్తానని, ఇతర పార్టీలో నుండి జనసేన పార్టీలో చేరుతున్న వారికి తగిన ప్రాధాన్యత, గౌరవం తప్పక ఇస్తామని త్వరలో ఏర్పాటు చేయనున్న అన్ని కమిటీలలో కొత్త పాత వారితో.. అన్ని కులాల, అన్ని మతాల వారితో సమతుల్యం సాధించేలా ఏర్పాటు చేసి.. అందరికీ ఆమోదయోగ్యంగా పార్టీని ముందుకు తీసుకెళ్తానని చెబుతూ.. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సందర్భంగా జనశ్రేణులందరూ అందరూ అప్రమత్తంగా ఉండి, జనసేన పార్టీ గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ అభివృద్ధికి, పేద ప్రజలకు వారు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు గానూ వారితో పాటు వారి సతీమణి “నాసేన కోసం నా వంతు” కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మిని దుస్సాలువాతో సత్కరించారు. జాయిన్ అయిన వారిలో నియోజకవర్గ టిడిపి సీనియర్ నేత సోడసాని శ్రీనివాసరావుతో పాటు సోడసాని వెంకటేష్ (నాని), బి.సి నేత పితాని రాంబాబు, సోడసాని శ్రీనివాసరావు, బి.సి నేత కోట రాము, కురుమళ్ళ సూరిబాబు, బి.సినేత నిడదవోలు సూరిబాబు, సోడసాని శ్రీను,
పిల్లా బ్రహ్మాజీ, బొంతల గోవింద్, ఈఊరి రామారావు, సోడాసాని కామేశ్వరరావు, పెద్దాడ గంగారావు, సుంకర వెంకటేష్, సుంకర నాగేశ్వరరావు, సోడసాని బ్రహ్మరావు , భూషంశెట్టి వీరబాబు, కురుమళ్ళ సత్తిబాబు, ప్రగడ బ్రహ్మం, నల్లిమిల్లి సురేష్, నిడదవోలు సాయి కిరీటి, బి.సి నేత నిడదవోలు వెంకటేష్ మామిడి ముసలయ్య, బంధం భీమన్న, సోడసాని దుర్గారావు, సోడసాని మణికంఠ, సోడసాని దొరబాబు ఇతర నేతలు కార్యకర్తలు ఉన్నారు. చక్రద్వారబంధం గ్రామ సీనియర్ నేతలు జాయిన్ చేయించినవారు గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ ఆనందాల గోవింద్ భూషంశెట్టి అర్జున్, పేపకాయల నాగేశ్వరరావు, కురుమళ్ళ మహేష్, పితాని వెంకటేష్, ఈ ఊరి వీరబాబు, కడియం దుర్గారావు, శెట్టి శ్రీనివాసరావు, నాగవరపు చల్లారావు, దాకవరపు నాగు, పేపకాయల మణికంఠ, పెదపాటి వెంకన్న బాబు, నల్లిమిల్లి వీరబాబు, సోడసాని ఏడుకొండలు, కురుమళ్ళ పరమేశ్వర రావు, నాగవరపు నాగన్న, నల్లమిల్లి రామకృష్ణ (క్రిష్), శెట్టి సత్యనారాయణ, ప్రగడ కోదండ రాముడు, సోడసాని ప్రసాద్, చిక్కాల వరప్రసాద్, నిడదవోలు సతీష్, సోడసాని రామ్ కుమార్, కురుమళ్ళ తేజ, నేమాల దుర్గారావు, ఆళ్ల దొరబాబు, వట్టికూటి రాధా, సోడసాని మణికంఠ, సోడసాని వీరబాబు ఇతర జనసైనికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో “నాసేన కోసం నా వంతు” కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రెటరీ మెడిశెట్టి శివరాం, సర్పంచులు కిమిడి శ్రీరాం, గల్లా రంగా, గుల్లింకల లోవరాజు, సీనియర్ నేతలు మద్దిరెడ్డి బాబులు, కొత్తపల్లి రఘు, మద్దిరెడ్డి బాబులు, యర్రంశెట్టి శ్రీను, అక్కిరెడ్డి వేణు, అరిగెల రామకృష్ణ, సంగుల తమ్మరావు, రంగుల రమేష్, బొబ్బరాడ వాసు, నాతిపాం దొరబాబు, వేగిశెట్టి రాజు, తోట అనిల్ వాసు, చాట్ల వెంకటేష్, గంగిశెట్టి రాజేంద్ర, పాలచర్ల రాజారావు, ముక్కపాటి గోపాలం, సోమన్న, రామిశెట్టి సతీష్, రఘునాదాపురం వీర్రాజు, రేలంగి బాబూరావు, ఎన్ ఆర్ కే, గండి జయసుధ, బచ్చు సుబ్బు, అలియా శ్రీను, డి ఎం ఎస్, యర్రంశెట్టి పొలారావు, దేవన దుర్గాప్రసాద్ ఇతర నేతలు, జనసైనికులు, వీరమహిళలలు, చక్రద్వారబంధం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.