అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బంది పడుతున్న 43వ డివిజన్ అంబేద్కర్ నగర్ ప్రజలు: బైరి వంశీ కృష్ణ

ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి ఆకుల సుమన్ ఆదేశాల మేరకు గ్రేటర్ వరంగల్ పరిధిలోని 43వ డివిజన్ అంబేద్కర్ నగర్ లోని డ్రైనేజీ సమస్య మీద జనసేన పార్టి తరపున జనసైనికులు సందర్శించడం జరిగింది. ఈ సందర్బంగా గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు బైరి వంశీ కృష్ణ మాట్లాడుతూ 43వ డివిజన్ అంబేద్కర్ నగర్ లోని సైడ్ డ్రైనేజీ పైన కాంట్రాక్టర్ అవగాహనా లోపంతో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైప్ లైన్ అడ్డు రావడంతో మురికి నీరు మరియు చెత్త పెరుకపోవడంతో దురువాసన వస్తుందని దోమల బెడదా కూడా అధికమావుతుందని వ్యక్తం చేసారు ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య మీద ద్రుష్టి పెట్టి మురుగు కాలవులో ఉన్న చెత్త పేరుకపోయిన వ్యర్థలను శుభ్రం చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ సెక్రటరీ శేషాద్రి సందీప్, యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ వస్కులా నిఖిల్ చోప్రా, ఇల్లందుల రాజు, కొట్టే మనోజ్, వివేక్ జీవన్ పాల్గొన్నారు.