ఖబడ్దార్ పైలా నరసింహాయ్య..

తాడిపత్రి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాడిపత్రి పట్టణ జనసేన అధ్యక్షుడు కుందుర్తి నరసింహా చారి మాట్లాడుతూ.. మార్చి 12వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో బి.సి. సంక్షేమ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొని బి సి సంక్షేమానికి పెద్దపీట వేయాలని కోరారు. ఈ కార్యక్రమన్ని విమర్శిస్తూ అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య గారు 13వ తేదీ పవన్ కళ్యాణ్ గారిపై చేసిన విమర్శలకు దీటుగా సమాధాన మిచ్చారు. ఇందులో భాగంగా పైలా నరసింహాయ్య గారికి 2008లో ప్రజారాజ్యం పార్టీలో ఒక బిసి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని ఆ రోజు శ్రీ కొణిదెల చిరంజీవిగారు ఇచ్చారు. గతాన్ని మరచి మాట్లాడటం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం, అంతేకాదు ఇలాంటి వారికి వంద మంది బిసి అభ్యర్తులకు బి ఫార్మ్ ఇచ్చి బిసి లపైన తన కున్న ప్రేమను చాటుకున్న వ్యక్తి చిరంజీవి గారు. నీకు చేతనైతే ఒక బిసి నాయకుడుగా నువ్వు తాడిపత్రి నియోజక వర్గంలో మి వైఎస్సార్సీపీ నుంచి మీ జగన్ మోహన్ రెడ్డి గారితో బి ఫార్మ్ తెచ్చుకో గలవా అని ప్రశ్నించారు.