షోకాజ్‌ నోటీసుపై ఎస్ఈసికి కొడాలి నాని వివరణ..

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకు మంత్రి కొడాలి నాని వివరణ ఇచ్చారు. ఎన్నికల కమిషన్‌పై తాను ఎలాంటి దురుద్దేశ వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. రాజ్యంగ సంస్థలంటే తనకు గౌరవం ఉందని అన్నారు. తొలిదశ ఎన్నికల ఫలితాలపై మాత్రమే మాట్లాడానని, దీనిపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ప్రతిపక్షాల వ్యాఖ్యలకు తాను సమాధానం చెప్పనని పేర్కొన్నారు. తన వివరణను పరిగణలోకి తీసుకుని షోకాజ్‌ నోటీసు వెనక్కి తీసుకోవాలని మంత్రి నాని ఎస్‌ఇసిని కోరారు. కేవలం ఎస్‌ఇసికి సలహా మాత్రమే ఇచ్చామని, దూషణలు చేయలేదని చెప్పారు.