‘కోయిలమ్మ’ నటుడు అమర్ అరెస్టు

బుల్లితెర నటుడు సమీర్ అలియాస్ అమర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. మణికొండలో బొటిక్ వ్యాపారంలో ముగ్గురు యువతుల మధ్య వివాదం నెలకొంది. ఇందులో ఒక యువతికి మద్దతుగా వెళ్లిన అమర్‌ .. తనను దూషించినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు రెండు వారాల క్రితం కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు అమర్‌ను అరెస్టు చేసి కూకట్‌పల్లి న్యాయస్థానంలో హాజరు పర్చారు. న్యాయస్థానం రిమాండ్‌ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.