జనసేన నాయకుల అక్రమ అరెస్టులకు కొండేపి జనసేన నిరసన ర్యాలీ

కొండేపి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున ఉత్తరాంధ్ర పర్యటనలో ఉండగా వైసీపీ ప్రభుత్వం జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని, ప్రజలకు మేలు జరగకూడదన్న ఉద్దేశంతో వారికి ఉన్న అధికార అహంకారంతో మా జనసేన పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టులు చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ ని వైసిపి నాయకులు వారి గుప్పెట్లో పెట్టుకొని, మహిళలు అని కూడా చూడకుండా వారిని కొట్టి భయభ్రాంతులకు చేయడం జరిగింది. కనీసం మా నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రజలకు అభివాదం కూడా చేయనీయకుండా అడ్డుకోవడం జరిగింది, ఇటువంటి వైసీపీ దౌర్జన్యాలకు రాబోయే రోజుల్లో ప్రజలు సరైన గుణపాఠం చెప్తారు, ప్రతి ఒక్క సామాన్య మానవుడి సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ని అడ్డుకోవడం దుర్మార్గపు చర్య, రాజ్యాంగ వ్యవస్థను సరైన విధానంలో అమలుపరచకుండా, న్యాయవ్యవస్థను తప్పు దోవలో నడిపిస్తూ, అక్రమ అరెస్టులు చేస్తూ, అమాయకపు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రజలకు అండగా ఉంటూ కొండేపి నియోజకవర్గంలో 6 మండలాల అధ్యక్షుల సమక్షంలో సోమవారం సింగరాయకొండలో వైసిపి ప్రభుత్వం చేసిన నిరంకుశత్వ ధోరణికి వ్యతిరేకంగా సోమవారం సింగరాయకొండలో ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి మరియు ఏపిజే అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఆంధ్రరాష్ట్రంలో ప్రతి ఒక్క సామాన్య మానవుడికి అండగా ఉండటానికి, వారి యొక్క అభివృద్ధికి పాటుపడడానికి, పుట్టిన పార్టీ జనసేన పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీలు ఈరోజు జనసేన పార్టీకి అండగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారని ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో అయినాబత్తిని రాజేష్, కనపర్తి మనోజ్ కుమార్, మారిశెట్టి చంద్రశేఖర్, కందుకూరి రాంబాబు, గూడా శశిభూషణ్, విశ్వం, మరియు వీరమహిళలు, జనసేన పార్టీ నాయకులు మరియు జనసైనికులు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.