సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కి జనసేన వినతిపత్రం

ఎల్ బి నగర్, శనివారం సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వ్యవస్థాపక అధినేత జనవాణి మరియు జిల్లాలో పార్టీ సమీక్షా కార్యక్రమంలో ఆదివారం మరియు సోమవారం పాల్గొనే నిమిత్తం విశాఖపట్నం జనసేన నాయకులు ముందుగా నిర్ణయించి, పోలీసు శాఖ వారి అనుమతి తీసుకుని, విశాఖపట్నం విమానాశ్రయం చేరుకుని, బయట నుండి జనసేన పార్టీ శ్రేణుల కోరిక మేరకు ర్యాలీగా తనకు బస ఏర్పాటు చేసిన నోవాటెల్ హోటల్ కు వెళ్లే మార్గములో తన కాన్వాయ్ శాంతియుతంగా సాగుతున్న సమయంలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ మంత్రులు తమ విశాఖపట్నం నగరంలో నిర్వహించిన గర్జన సభలో పాల్గొని తిరుగు ప్రయాణంలో విమానాశ్రయం చేరుకునే సమయంలో శ్రీమతి రోజా సెల్వమణి జనసేన పార్టీ శ్రేణులతో వ్యంగ్యంగా ప్రవర్తించిన తీరుకు నిరసన తెలుపుతున్న క్రమంలో ర్యాలీలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి మంత్రుల వాహన సమూహంపై రాళ్ళు రువ్విన సంఘటనలో ఎటువంటి ఆధారాలు నిరూపణ కాకముందే పవన్ కళ్యాణ్ సమూహంలో పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న వాహనం పైకి ఎక్కి గౌరవనీయులైన పోలీసు అధికారి కళ్యాణ్ ప్రాధమిక హక్కుకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించటం జరిగింది. ఒక ప్రక్క మంత్రులు మరొక ప్రక్క అత్యధిక ప్రజాదరణ ఉన్న జనసేన పార్టీ వ్యవస్థాపక అధినేత ప్రయాణిస్తున్న మార్గంలో పోలీసు అధికారులు తగిన రీతిలో సిబ్బందిని నియమింలేదు, శాంతి భద్రతలు కాపాడ వలసిన వారే తమ విధిని విస్మరించి శాంతియుతంగా ఉన్న జనసైనికులపైన కేసులు నమోదు చేశారు. సిసి ఫుటేజ్ చూపకుండా కేసులు నమోదు చేశారు, తగిన ఆధారాలు చూపి శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కేసులు నమోదు చేయ‌‌‌వచ్చు. ఈ విషయంలో పోలీసు శాఖ వారు విఫలం చెందారు. ఈ సంఘటనని హైదరాబాద్ నగర జనసేన పార్టీ శ్రేణులం ఖండిస్తున్నాం విమానాశ్రయం చేరుకునే సమయంలో ప్రభుత్వం కావాలనే విద్యుత్ సరఫరా నిలిపివేయించినది, చాలా ఇబ్బంది పడుతూ వేలాది మంది మొబైల్ ఫోన్ల వెలుతురు సహాయంతో నోవాటెల్ హోటల్ చేరుకున్న తర్వాత ప్రభుత్వ మరియు మంత్రుల ఒత్తిడితో కళ్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ వద్ధ పోలీసు వారు ఉద్రిక్తత వాతావరణం సృష్టించి అన్యాయంగా ఎటువంటి ఆధారాలు చూపకుండా జనసేన పార్టీ నాయకులను, వీరమహిళలను, కార్యకర్తలను, శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా పార్టీ కార్యక్రమాలకు ఆటంకం కల్పించి అదుపులోకి తీసుకున్న పార్టీ శ్రేణులకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పద్మనాభం పోలీసు స్టేషన్ లో నిర్బంధించి ఎటువంటి సదుపాయాలు కల్పించలేదు. వీర మహిళలకు తగిన వసతి ఏర్పాటు చేయలేదు అలజడి చేశారు. ఇదంతా ప్రభుత్వ పెద్ధల ఆదేశానుసారం పోలీసు వారు చేశారని భావిస్తున్నాము. ఈ సంఘటనని ఖండిస్తున్నాం కావున అదుపులోకి తీసుకున్న జనసేన పార్టీ శ్రేణులను ఎటువంటి కేసులు నమోదు చేయకుండా భేషరతుగా విడుదల చేయాలని నోవాటెల్ హోటల్ ఉన్న విశాఖపట్నం తూర్పు పోలీసు శాఖ వారు విధించిన సెక్షన్లు 30ఏ, 144 ఎత్తివేసి విశాఖపట్నంనకు శాంతిభద్రతల విషయంలో ఊన్న మంచి పేరుని కొనసాగించాలని ప్రజలకు సహరించాలని జనసేన పార్టీ శ్రేణులు శాంతికి ఎటువంటి ఆటంకం కలిగించరని హామీ ఇస్తూ మా వినతి పత్రం స్వీకరించాలని స్థానిక సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కి వినతిపత్రం అందచేసి విశాఖపట్నం జనసేన పార్టీ శ్రేణులకు మద్దతు తెలుపుతూ న్యాయ పోరాటానికి సిద్ధమని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్ బి నగర్ జనసేన నాయకులు వెంకట సాయి ప్రసాద్ కోటిపల్లి తదితరులు పాల్గొన్నారు.