కాపు సంక్షేమ శాఖ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోనేటి మురళీకృష్ణ

  • బలిజ కులానికి సంజీవని కాపు సంక్షేమసేన
  • కడప అన్నమయ్య జిల్లాల కేఎస్ఎస్ కోఆర్డినేటర్ యర్రంశెట్టి మస్తాన్ రాయలు

కడప, కాపు సంక్షేమ సేన కడప జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోనేటి మురళీకృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం కాపు సంక్షేమ శాఖ జిల్లా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కడప అన్నమయ్య జిల్లాల కాపు సంక్షేమ శాఖ కోఆర్డినేటర్ యర్రంశెట్టి మస్తాన్ రాయలు, కాపు సంక్షేమ శాఖ జిల్లా అధ్యక్షులు గడేకుల వెంకటరమణ కలిసి కడప నగరంలో శంకరాపురంలో నమస్తే బోర్డ్ ఎదురుగా ఏర్పాటు చేసిన కాపు సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కోనేటి మురళీకృష్ణ కు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యర్రంశెట్టి మస్తాన్ రాయలు మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత బలమైన సామాజిక వర్గములైన కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు ఇంతవరకు రాజ్యాధికారం తగ్గలేదన్నారు. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వారంతా వారి వారి సామాజిక వర్గాలను బలోపేతం చేసుకున్నారే తప్ప కాపు ఒంటరి తెలగ బలిజ కులాలకు రాజ్యాధికారం రాకుండా కుట్రలు పన్నారన్నారు. అందుకే కాపులకు రాజ్యాధికారం దిశగా కాపు సంక్షేమ శాఖ పనిచేయడానికి నడుం బిగించిందన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కులానికి కాపు సంక్షేమ శాఖ సంజీవని లాంటిదని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలోనూ కాపు సంక్షేమ శాఖ కమిటీలను వేసి రాబోయే ఎన్నికల నాటికి అత్యంత బలమైన సంఘంగా తయారు కావాలని పిలుపునిచ్చారు. కాపు సంక్షేమ శాఖ వ్యవస్థాపక అధ్యక్షులు చేగుంట హరిరామ జోగయ్య కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల ఐక్యత కోసం ఈ వేదికను ఏర్పాటు చేశారన్నారు. అన్ని కులాల వారితో రాయలసీమలోని బలిజల్లో విద్యావంతులు చురుకైన యువకులు ఈ సంస్థలో భాగస్వాములై సైనికుల్లా పనిచేస్తే మన జాతికి రాజ్యాధికారం తప్పకుండా వస్తుందని చెప్పారు. ఆయన మంచి సంబంధాలు నిర్వహిస్తూ జాతికి రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు నడుపుతున్నారన్నారు. పార్టీకి రాజ్యాధికారం రావాలంటే ముందుగా పదవుల కోసం మనం పోట్లాడకుండా ఇతర కులాలకు ప్రాధాన్యత ఇచ్చి మనం వెనక ఉండి నడిపించగలిగితే మన లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. కార్యక్రమంలో కె. ఎస్. ఎస్. కడప జిల్లా గౌరవ అధ్యక్షులు దాసరి బాబురావు, శంకరాపురం సుబ్బారావు, బలిజ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు కోవూరు మస్తాన్ రావు, సమ్మెట సత్యనారాయణ, శెట్టి నారాయణ, నారాయణ, మరియు కరెంట్ ఆఫీస్ సతీష్, తిరుమల హాస్పిటల్ ఆర్గనైజర్ రాజశేఖర్ నాయుడు, అక్కిశెట్టి శ్రీనివాసులు, మరియు కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.