సేవా కార్యక్రమాలతో కోటా చంద్రబాబు జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం నాయకులు, ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా భర్త కోటా చంద్రబాబు జన్మదినం సందర్భంగా శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బ్రెడ్లు, పళ్లూ, బిస్కెట్లు పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి పేట చంద్ర శేఖర్, నాయకులు నితీష్ కుమార్, ముడుసు గణేష్ ,వెంకట రమణ యాదవ్, మూర్తి గారి గురవయ్య తదితరులు పాల్గొన్నారు.