కొట్టే వారి ప్రచార రధాలు – జనసేన విజయ రధాలు

తిరుపతి, రాష్ట్రంలో జనసేన-టిడిపి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడటం తధ్యమన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. గురువారం ఆయన అలిపిరి వద్ద జనసేన ప్రచార రధాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన బలోపేతానికి, పార్టీ విజయానికి ఎన్నారై కొట్టే ఉదయ భాస్కర్ తన సొంత నిధులతో 30 ప్రచారరథాలను అందజేయడం అభినందనీయమన్నారు. తిరుపతి నియోజకవర్గంలో ఆ దేవ దేవుడు శ్రీ కలియుగ వేంకటేశ్వర స్వామి పాదాల చెంత జనసేన విజయాడంకా మోగాలని పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్టం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరుపన రాష్ట్ర ప్రజల తరుపున జనసేన నాయకుల తరుపున వారికి ధన్యవాదములు తెలియచేశారు. రాష్ట్రంలో జరిగే పార్టీ ప్రచారంలో మొత్తం విజయ రథాల నిర్వహణ వెంకట్రావు చూసుకుంటారన్నారు. జనసేన పోటీ చేసే ప్రతిచోటా ఈ ప్రచార విజయ రథాలను ఇచ్చి వారి విజయానికి తొడ్పడుతున్న కొట్టే ఉదయ భాస్కర్ కి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరుతున్న శుభసందర్భంలో వారికి ఆహ్వానం మనస్పూర్తిగా పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా గౌరవ అద్యక్షులు కృష్ణయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, జిల్లా కార్యదర్శులు ఆనంద్, బీగల అరుణ, బాటసారి, చిత్తూరు జిల్లా ప్రచార నిర్హవాహన కమిటీ సభ్యులు దినేష్ జైన్, తిరుపతి నగర్ కమిటీ నాయకులు రవి, శిరీష హేమంత్, నవీన్, పురుషోత్తం, పురుషోత్తం రాయల్, సాయి, రూరల్ నాయకులు మనోజ్ కుమార్, గౌస్ బాషా, జనసైనికులు మోహిత్, బాలాజీ, ఇంద్ర వీరమహిళలు మధులత, దివ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.