కోవిడ్ నివారణ చర్యలు పాటించాలి: శ్రీశైలం ఈవో

కర్నూలు: భక్తులందరూ తప్పనిసరిగా కోవిడ్ నివారణ చర్యలు పాటించాలని శ్రీశైలం దేవస్థానం ఈవో కేఎస్ రామారావు విజ్ఞప్తి చేశారు. ఆలయంలో కోవిడ్ నియంత్రణ చర్యలపై దేవస్థానం ఈవో ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దేవస్థానంలోని అన్ని విభాగాల యూనిట్ అధికారులు టెలికాన్ఫరెన్స్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ నివారణ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఆలయంలో కరోనా నివారణ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఈవో కేఎస్ రామారావు పేర్కొన్నారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్ వాడాలని ఈవో కేఎస్ రామారావు సూచించారు.