తెలంగాణ కరోనా బులెటిన్

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 1102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 91361కి పెరిగింది. అలాగే గత 24 గంటల్లో 9 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 693కి చేరింది. గత 24 గంటల్లో తెలంగాణలో 1930 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 68126కి పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 22542గా ఉంది. వాటిలో 15502 మంది ఇళ్లలోనే ఉంటూ ఐసోలేషన్‌లో కొనసాగుతున్నారు.