సాగరం పంచాయతీ యువతకు క్రికెట్ కిట్ అందజేసిన రాయపురెడ్డి కృష్ణ

మాడుగుల నియోజకవర్గం: మాడుగుల మండలం, సాగరం పంచాయతీ సాగరం పాత కాలనీ యువతకు మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ, సాగరం జనసేన నాయకులు పాము నాగరాజు చేతుల మీదుగా ఒక క్రికెట్ కిట్ ను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగరాజు మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీకి ఇస్తున్న ప్రక్రియలో మా సాగరం పంచాయతీకి గతంలో సురవరం గ్రామానికికి ఇప్పుడు మా గ్రామానికి ఇచ్చినందుకుగాను రాయపరెడ్డి కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గట్టా రామారావు మరియు సాగరం పంచాయతీ జనసైనికులు పాల్గొన్నారు.