రవికుమార్ యాదవ్ కి మద్దతు పలికిన కుత్బుల్లాపూర్ జనసేన

తెలంగాణ, శేర్లింగంపల్లి నియోజకవర్గం ఇన్చార్జ్ మాధవరెడ్డి సూచన మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ నందగిరి సతీష్ వెంకటేశ్వర నగర్లో దేవేందర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి బిజెపి చేరికల్లో పాల్గొని జనసేన యొక్క సత్తా చాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మరియు శేరిలింగంపల్లి జనసేన శ్రేణులు వివేకానంద నగర్ డివిజన్ జనసేన అధ్యక్షులు ప్రవీణ్ సాహు గారు కార్యకర్తలు పాల్గొన్నారు.