కొలిమిగుండ్లలో పారిశుద్ధ్య లోపం.. వెంటనే చర్యలు చేపట్టాలి: జనసేన వినతిపత్రం

బనగానపల్లె: కొలిమిగుండ్ల మండల కేంద్రంలో పారిశుధ్య లోపం ఉందని కొలిమిగుండ్లలో చెత్త సేకరణ జరగడంలేదని.. వెంటనే చర్యలు చేపట్టాలని కొలిమిగుండ్ల మండల జనసేన పార్టీ నాయకుడు పెద్దయ్య ఆధ్వర్యంలో సోమవారం పంచాయితీ సెక్రెటరీకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. బనగానపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు భాస్కర్ ఆదేశాల మేరకు కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని అన్ని గ్రామాల పారిశుధ్య పరిస్థితులు తెలుసుకునే కార్యక్రమం పెద్దయ్య మరియు జనసైనికులు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దయ్య మాట్లాడుతూ కొలిమిగుండ్లలో ఎక్కడ చూసినా చెత్తాచెదారాలే కనిపిస్తున్నాయని, చెత్త సేకరణ ఎక్కడ జరగడంలేదని కేవలం ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు వచ్చినప్పుడు మాత్రమే వీధులను శుభ్రపరిచి చెత్త సేకరిస్తున్నారని, మండల కేంద్రంలోనే ఇలా ఉంటే గ్రామాల్లో పారిశుధ్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు. కొలిమిగుండ్ల గ్రామపంచాయతీకి చెత్త సేకరణ ట్రాక్టర్లు ఉన్నాయా లేవో తెలియడం లేదని ఎక్కడ కూడా చెత్తకుండీలు కూడా కనిపించడం లేదని, కానీ గ్రామపంచాయతీ కార్మికులకు మాత్రం ప్రతినెలా జీతం చెల్లించడంలో స్థానిక ప్రభుత్వాధికారులు ముందున్నారని, జనంగోడు వీరికి పట్టడం లేదని పందుల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి వాటిని సురక్షితంగా వేరే చోటికి తరలించేలా ఏర్పాట్లు చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కొలిమిగుండ్ల గ్రామపంచాయతీకి ఎన్ని నిధులు విడుదల చేశారో తెలియజేయాలని త్వరలోనే కొలిమిగుండ్ల గ్రామపంచాయతీకి సంబంధించి పనులు అధికారులు చేపట్టకపోతే జనసేన పార్టీ తరఫున స్థానిక ప్రజలతో కలిసి ఉద్యమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కుమార్, వీరాంజనేయులు, ఏఐటీయూసీ రామకృష్ణ, ఎమ్మార్పీఎస్ కంబగిరిస్వామి, పొడిగాళ్ల హరికృష్ణ, లొడుగు రంగడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.