వాహన బేరర్లకు లక్ష బ్రహ్మోత్సవ బహుమానం

  • టిటిడి ఛైర్మన్ సమక్షంలో అందజేసిన జనసేన జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుమల, శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి వాహనాలను మోసే వాహన బేరర్లకు జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ లక్ష రూపాయలను బ్రహ్మోత్సవ బహుమానంగా అందజేశారు. గురువారం ఉదయం జరిగిన మోహినీ అవతారంలో జరిగిన వాహనసేవలో టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో ఈ మొత్తాన్ని ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో వాహన బేరర్లకు లక్ష రూపాయలు బ్రహ్మోత్సవ బహుమానంగా ఇస్తున్నామన్నారు. స్వామివారి వాహన సేవలను ప్రతి నిత్యం మోస్తూ శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ మలయప్పస్వామి వారి సేవలో తరిస్తున్న వాహన బేరర్లకు బహుమానం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.