మిరాకిల్ కాలేజీలో ఉచిత ఎంసెట్ శిక్షణా తరగతుల ప్రారంభం

నెల్లిమర్ల, శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో చేపట్టిన యువ భరోసా అనే కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని పేద విద్యార్థినీవిద్యార్థులకు ఎంసెట్ రిజిస్ట్రేషన్ మరియు కోచింగ్ ఉచితంగా ఇవ్వదలుచుకున్నారు. దానిలో భాగంగానే ఏప్రిల్ 15 నుండి నియోజకవర్గంలోని సుమారు 250 పైచిలుకు విద్యార్థినీద్యార్థులకు మిరాకిల్ కాలేజీలో ఉచితంగా ఎంసెట్ శిక్షణ తరగతుల ప్రారంభించారు. శుక్రవారం అక్కడికి వెళ్లిన జనసేన నాయకులు లోకం ప్రసాద్ అక్కడ ఉన్న విద్యార్థినీవిద్యార్థులతో ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా లోకం ప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం మొదలు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం నియోజకవర్గంలోనే పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలి అని, మెరుగైన విద్యా ఉద్యోగాలు కనిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టామని లోకం ప్రసాద్ తెలియజేశారు. విద్యార్థులకు ఎప్పుడూ అండగా జనసేన నాయకురాలు శ్రీమతి లోకం మాధవి ఉంటారని భరోసా ఇచ్చారు. ఆ తరువాత విద్యార్థులకు కావలసిన పుస్తకాలు మరియు మెటీరియల్స్ ని పంపిణీ చేశారు.