పిడుగురాళ్ళ గిరిజన బాలికల గురుకుల పాఠశాలని సందర్శించిన జనసేన నాయకులు

గురజాల: గురుకుల విద్యాలయంలో విద్యార్థులు ఆకలితో బాధపడుతున్నట్లు, మెనూ ప్రకారం పెట్టాల్సినవి పెట్టకుండా.. చాలీచాలని నీళ్ళ సాంబార్ పోసిన వీడియో వైరల్ అవ్వడంతో.. గురువారం గురజాల నియోజవర్గం, పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ నాయకులు విద్యార్థులను సందర్శించి, భోజనం వారికి ఏ విధంగా అందిస్తున్నారో.. మెనూ ప్రకారం ఎలా పెడుతున్నారో తెలుసుకోవడం జరిగింది. విద్యార్థులు మాట్లాడుతూ.. సమయానికి భోజనం అందించడం లేదని, ఒక్కొక్కసారి క్లాసులు సైతం మిస్ అవుతున్నాయని, చాలీచాలని భోజనం పెడుతున్నారని, అదేమిటని ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారని, విద్యార్థుల భోజనానికి వాడే సరుకుల్ని పక్కదారి పట్టిస్తున్నారని, ప్రిన్సిపాల్ కి సైతం తెలియజేసినా ఫలితం లేదని వాపోయారు. పాఠశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లగా.. వారి మాటల్లో… తప్పు మొత్తం వారికి మెనూ తయారు చేసే వంట వారిదేనని, వారి మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, శిథిలా వ్యవస్థకు చేరుకున్న భవనాలకు నాడు నేడు డబ్బులు రాలేదని, మా సొంత డబ్బులతో.. చిన్న చిన్న రిపేర్లు చేయించుకుంటున్నామని తెలియజేశారు. జనసేన నాయకులు మాట్లాడుతూ.. గిరిజన బాలికలకు మౌలిక సదుపాయాలు ఈ ప్రభుత్వం అందించలేకపోతుందని, సరైన బిల్డింగ్స్, రక్షణ కరువైందని, మాట్లాడితే ఎమ్మెల్యే అభివృద్ధికి సిద్ధం అంటూ.. ఉత్తమ కుమార్ ప్రగల్బాలు పలకడమే తప్ప, ప్రజలకు వరగబెట్టిందేమీ దుయ్యబట్టారు, ఇప్పటికైనా అధికారులు స్పందించి, విద్యార్థులకు కడుపునిండా భోజనం అందేలా.. క్లాసులకు సరిపడా టీచర్స్ ఏర్పాటు చేయాలని, శిధిలా వ్యవస్థలో ఉన్న భవనాలను బాగు చేసి, హాస్టల్ కి చుట్టూ సీసీ కెమెరాలు పర్యవేక్షణ ఏర్పాటు చేసి, పోలీస్ బందోబస్తు ఉంచాలని, తద్వారా విద్యార్థుల రక్షించవలసిందిగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాశీం సైదా, మండల ఉపాధ్యక్షులు బయ్యవరపు రమేష్, ప్రధాన కార్యదర్శి గుర్రం కోటేశ్వరరావు, కార్యదర్శి దీకొండ కిరణ్, కంభంపాటి ముక్కంటి, జనసేన నాయకులు పెడకోలిమి కిరణ్ కుమార్, జెస్సి తదితరులు పాల్గొన్నారు.