కష్టంలో ఉన్న కుటుంబానికి అండగా తెలుగుదేశం నాయకులు
ఏలూరు జిల్లా, ద్వారకా తిరుమల మండలం, గుణ్ణంపల్లి పంచాయతీ గుణ్ణంపల్లిలో ఇటీవల కాలంలో నల్లజర్ల హైవే రోడ్డుపై యాక్సిడెంట్ లోగున్నంపల్లి గ్రామానికి చెందిన ఓకే కుటుంబంలో ఇద్దరు ఒకరు మరణం రెండో వారు చికిత్స నిమిత్తం ఏలూరు హాస్పిటల్ లో ఉన్నారు. గున్నూరి ముసలయ్య మరియమ్మల రెండవ సంతానం చనిపోయిన రెండు సంవత్సరాల చిన్నారి మగ బిడ్డ మరియు గున్నూరి సుబ్బారావు మరియమ్మల కుమారుడు చందర్రావు యాక్సిడెంట్లో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నారు. ఇది తెలుసుకున్న గుణ్ణం పల్లి కాపురస్తులు గున్నూరు వారి కుటుంబానికి తీర్చలేని లోటు జరిగింది. కనుక వెంటనే స్పందించి. చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించి, గున్నంపల్లి తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షులు సంక్రాంతి శ్రీనివాస్ రావు, సంక్రాంతి రాంబాబు (5000/-) రూపాయల ఆర్థిక సహాయం అందించి ఉన్నారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమడోలు అశోక్, గుణ్ణంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ హస్బెండ్ తాని గడప రమేష్. జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు దుక్కిపాటి చరణ్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఉన్నారు.