నాదెండ్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
తెనాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాపతి, జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను అమలాపురం నియోజకవర్గం నాయకులు కలిశారు. ఆయన జన్మదిన సందర్భంగా తెనాలిలోని ఆయన స్వగృహంలో జరిగిన జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-06-at-18.00.10-1024x576.jpeg)