వైయస్ జగన్ అపరిచితుడు: పోతిన మహేష్

  • కుర్చీ కోసం కుటుంబ సభ్యుల్ని వదిలేసుకున్న సీఎం జగన్ శత్రువులను ఎలా ప్రేమిస్తారు? జోగి రమేష్
  • పవన్ కళ్యాణ్ ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేకే జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తూ కుట్రలు పన్నుతున్నారు
  • జనసేనలో చేరికలు
  • రజకుల ఆత్మగౌరవ దీక్ష పోస్టర్ ఆవిష్కరణ

విజయవాడ, పశ్చిమ నియోజకవర్గ 32వ డివిజన్ నుంచి పిళ్లా దుర్గారావు, ఉజ్జా శ్రీనివాస్, ఎడ్ల రాము, ముత్యం లక్ష్మణ్, బొపాడుపు రాము, పాతర్లపల్లి లక్ష్మణరావు వెళ్లి రాంబాబు మీసాయి లక్ష్మణ మరియు పాతికమందితో స్థానిక డివిజన్ అధ్యక్షులు పి కిరణ్ నేతృత్వంలో జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోతిన మహేష్ సమక్షంలో పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం నాయకులు బొలిశెట్టి వంశీ, నగర ఉపాధ్యక్షుడు వెన్నా శివశంకర్, పి.శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాయకత్వ పటిమ, పార్టీ సిద్ధాంతాలు, భావజాలం నచ్చి పార్టీలోకి చేరారని, వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న జోగి రమేష్ కుర్చీ కోసం కుటుంబ సభ్యుల్ని వదిలేసుకున్న సీఎం జగన్ శత్రువులను ఎలా ప్రేమిస్తారని, ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి స్టేట్మెంట్లు ఇస్తున్నారని, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిలో చాలా షేడ్స్ ఉన్నాయని, వైయస్ జగన్ అపరిచితుడని పవన్ కళ్యాణ్ పై రెక్కీ చేసింది ముమ్మాటికి సీఎం జగన్ నేతృత్వంలో జరిగిందనే అనుమానం కలుగుతుందని, క్రిమినల్ రాజకీయాలకు జగన్ పెట్టింది పేరనీ, రాజకీయ లబ్ధి కోసం సొంత బాబాయి వివేకానంద రెడ్డిని హత్య చేసిన దుండిగలను పక్కనే పెట్టుకున్న వ్యక్తిని, అధికారం పంచుకోవాల్సి వస్తుందని తల్లిని, చెల్లిని గెంటేసిన మీకు కుటుంబం మీద కన్నా కుర్చీ మీదే ప్రేమ ఎక్కువని, సామాన్య ప్రజలు కూడా గొంతు ఎత్తితే సి.ఐ.డి పోలీసులతో అరెస్టు చేసిన మీరు శత్రువులు బాగుండాలని కోరుకుంటారా? అని, హైదరాబాదులో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన వ్యక్తుల కారుపై ఏపీ మూలాలు ఉన్నాయని దానిపై సీఎం, డిజిపి ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలని, పవన్ కళ్యాణ్ ని విభేదించిన ఆలీకి, పచ్చి బూతులు తిట్టిన పోసానికి పదవులు వచ్చాయని, పవన్ కళ్యాణ్ ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేకే జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తూ కుట్రలు పన్నుతున్నారని, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రలూ, కుతంత్రాలను జనసైనికులు తిప్పికొట్టేందుకు అన్నివేళలా సిద్ధంగా ఉంటారని, ప్రజాస్వామ్యంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తావు లేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎంతవరకైనా పోరాడతారన్నారు. పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉన్నందున కేంద్ర ప్రభుత్వం తక్షణమే జెట్ క్యాటగిరి సెక్యూరిటీ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈనెల 6, 7, 8 తేదీల్లో రజకుల ఆత్మగౌరవ దీక్షకు సంఘీభావం తెలియజేయవలసిందిగా రాష్ట్ర రజక సంఘం నాయకులు మహేష్ ని ఆహ్వానిస్తూ పోస్టర్ను వారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేయడం జరిగింది.