ఆశావర్కర్ల న్యాయ పరమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలి: పెండ్యాల శ్రీలత

  • అన్నివర్గాల ప్రజలను రోడ్లమీదకు లాగుతున్న వైకాపా ప్రభుత్వం
  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అనంతపురం కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వారి ప్రాదాన డిమాండ్ల అమలుకోసం వంటా-వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. వీరికి జనసేన పార్టీ తరపున రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత పాల్గొని దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని, మహిళలని చూడకుండా వారి న్యాయ బద్దమైన డిమాండ్లను అమలు చేయకుండా ఆశా వర్కర్లను రోడ్డుమీదకి లాగారు అదేవిధంగా కరోనా వంటి విపత్కర పరిస్థితులలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆశావర్కర్లు ప్రజారోగ్యం కోసం కృషి చేశారని ప్రభుత్వం వారి న్యాయ బద్దమైన డిమాండ్లైన కనీస పనికి కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని ఆశావర్కర్ల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని 62 సంవత్సరాల రిటైర్మెంట్ జీవోను వర్తింపచేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5లక్షలు ఇవ్వాలని అదేవిధంగా రిటైర్మెంట్ తర్వాత వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని మొదలగు ముఖ్యమైన 10రకాల డిమాండ్లను వైకాపా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని జనసేన పార్టీ తరపున ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.