వాలంటీర్లను అడ్డం పెట్టుకొని జనసేనానిపై బురద చల్లితే చూస్తూ ఊరుకోం.. జగన్

  • గునుకుల కిషోర్, కోలా విజయలక్ష్మి ఆధ్వర్యంలో జనసేన నిరసన

నెల్లూరు: మకిలి పట్టిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి వచ్చిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అంటూ .. జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, వీరమహిళా రీజనల్ కోఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి ఆధ్వర్యంలో అంబేద్కర్ స్థానిక పిఆర్సి సెంటర్లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి దుష్టశక్తుల చేత బట్టి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటం మకిలి పాలాభిషేకంతో కడిగామని తెలిపారు. అనంతరం వైయస్ జగన్ బొమ్మ తగలబెట్టపోగా పోలీసులు అడ్డుపడ్డారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే వ్యక్తి కాదు ఇటువంటి విషయాలు మాట్లాడాలంటే గట్స్ ఉండాలి. వాలంటీర్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని వైసీపీ చేస్తున్న దుష్ట రాజకీయాన్ని బయట పెట్టడమే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. జాబ్ క్యాలెండర్స్ ఇస్తానని యువకులను మోసం చేసి గవర్నమెంట్ ఉద్యోగం పేరిట ఇచ్చిన వాలంటరీ ఉద్యోగాలను పర్మినెంట్ చేయగలరా ఆలోచించండి..? పలానా వైసిపి నాయకుడు చెప్పినట్టు వైసిపి కార్యకర్తలుగా వాలంటీర్లు పనిచేయడం నిజం కాదంటారా.. లేకుంటే రోజుకు 150రూపాయలతో వారి కరపత్రాలను వాళ్ళ స్టికర్లను అంటించి వారి ప్రచారం ఎందుకు చేస్తారు. వైసిపి పార్టీకి ప్రచారానికి వచ్చే కూలీలకు కూడా రోజుకి 300 ఇస్తున్నారు అందులో సగం మాత్రం మీకు ఇస్తున్నారు. ఈ చాలీచాలని జీతాలతో గ్రూపుల్లో డిస్కషన్సు మా దృష్టికి వచ్చాయి. వారు స్థానికంగా వచ్చినప్పుడు ప్రజలందరినీ కూడ గట్టాటానికి ఎందుకు పిలుపునిస్తారు. గవర్నమెంట్ ఇస్తున్న జీతంతో పని చేసే మీకు పలానా పార్టీకి పనిచేయాల్సిన అవసరం ఏమి ఆలోచించండి. చాలీచాలని జీవిత జీతాలతో రేపు ఎప్పుడైనా మిమ్మల్ని పర్మినెంట్ చేస్తానని ఉద్దేశంతో నడుస్తున్నారేమో, అది కలే మాట తప్పడం మడమ తిప్పడం వైసిపి పార్టీకి అలవాటే, ఇదే విధంగా చేస్తూ పోతే రామన్న రోజుల్లో మిమ్మల్ని వైసీపీ కార్యకర్తల కింద జతకట్టి మరుగున పడవేయాల్సి వస్తుంది. న్యాయస్థానం కూడా తీర్పు నిచినట్లు మా మా వ్యక్తిగత విషయాలు మీకు ఎందుకు అందించాలి. కొంతమంది వాలంటీర్లు తమ కోరిక తీరుస్తానని తెలిస్తేనే సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పడం, ఒంటరిగా ఉన్న మహిళలను వేధించడం.. మీకు ఎవరికీ కనబడలేదా. బొమ్మలు దగ్దం చేస్తే కేసు నమోదు చేస్తానన్న ప్రభుత్వానికి ఈ రోజున మీ కార్యకర్తలు బొమ్మల దహనం కనపడలేదా..? ప్రభుత్వ వ్యవస్థ మారాలన్నా మాకో చట్టం మీకో చట్టం అనే నానుడి మారాలన్న ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాల్సిందే. జగన్ గారు మాట్లాడుతూ వీరిని రాజకీయ నాయకులను చేస్తానన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎంతమందిని చేస్తారు,జరిగిపోయిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంతమంది చేశారో సర్పంచి ఎలక్షన్ లో ఎంతమందికి చేశారో వివరించాల్సి ఉంది. కొంత మంది వైసిపి తొత్తులు విషయం వదిలేస్తే ఎంతోమంది వాలంటీర్లు పేద బలహీన వర్గాలకు చెందినవారు చుట్టూ ఉన్నవారికి పెన్షన్లు అనేక సంక్షేమ పథకాలు రకరకాల కారణాలతో ఎత్తివేస్తుంటే బాధ కలగడం లేదా..? మీరు కేవలం 5000 ఇస్తానన్న నెపంతో ఏమి జరిగిందో కూడా తెలియకుండా పవన్ కళ్యాణ్ గారిని దూషించమని పంపే మీకు సిగ్గు ఉందా.. అదాల ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టు ఏమీ తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు స్పష్టంగా విషయం పరిగ్రహణంతోనే మాట్లాడుతున్నారు. ప్రచారానికి వెళ్ళేటప్పుడు వాలంటీర్లు ఎందుకు రావాలి ప్రభుత్వ ఖజానా తో చేస్తున్న సంక్షేమ పథకాలు మీ పేరుతో ఎందుకు ఇవ్వాలి వాలంటీర్లు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి..? అవి మీకు ఇచ్చే 5000 రూపాయలకు మీకు అప్పగించే పనులకి ఏమైనా సంబంధం ఉందా, మీకు న్యాయం చేసే ప్రభుత్వం వైసీపీగా నమ్ముతున్నారా. ఈ రోజున అంగన్వాడి అంగన్వాడి ఉద్యోగస్తులు వారికి న్యాయం జరగాలని రోడ్లు ఎక్కడం చూడలేదా మున్సిపాలిటీలో కానీ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గాని పార్ట్ టైం వారందరినీ పర్మినెంట్ చేస్తానని ప్రగల్బాలు పలికిన వైసిపి గవర్నమెంట్ చేసిందా. మీ ఆశను క్యాష్ చేసుకుంటున్న వైసిపికి సమాధానం ఇవ్వండి. మీ జ్ఞానాన్ని మేధో సంపదని ఎందుకు పనికి రాకుండా స్థానికంగానే అణిచివేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి సరైన సమాధానం చెప్పండి అని తెలిపారు. హలో ఏపీ బై బై వైసిపి మీకో చట్టం మాకో చట్టం కాదు అందరికీ ఒకే చట్టం కావాలి. జనసేన పంతం వైసీపీ అంతం అనే నినాదాలతో ప్రాంతం అంతా మారుమోగిపోయింది. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ తో పాటు, వీరమహిళా రీజనల్ కోఆర్డినేర్ కోలా విజయలక్ష్మి, రేణుక, హైమావతి, నిర్మల, ఉమాదేవి, కృష్ణవేణి, జనసేన జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్ ఖలీల్ వర్షం సాయి చారు కాసిఫ్ మౌనిష్ శరవణ కేశవ తదిత జనసైనికులు పాల్గొన్నారు.