ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపిద్దాం: కుంటిమద్ది జయరాం రెడ్డి

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయ సాధన కోసమైతే… బిజెపి, టిడిపితో పొత్తు పెట్టుకున్నారో ఆ ఆశయాన్ని సాధించే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేయుచున్నటువంటి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులకు మరియు పార్లమెంట్ అభ్యర్థులు అందరికీ మన ఓట్లు వేసి వేయించి గెలిపిద్దాం అని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జయరాం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలందరికీ మరియు జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, కార్యకర్తలు అందరికి విజ్ఞప్తి ఎన్డీఏ కూటమి తరఫున అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మరియు అనంతపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారు పోటీ చేయుచున్నారు ఇరువురి సైకిల్ గుర్తు పైన మనందరం ఓటు వేసి మనందరి వారితో ఓట్లు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం అని జయరాం రెడ్డి పిలుపునిచ్చారు.