ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 21 వ రోజు పాదయాత్ర

ఏలూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహాన్ని తీసుకెళ్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నామని రెడ్డి అప్పల నాయుడు అన్నారు. స్థానిక 15వ డివిజన్ ఆముదాల అప్పలస్వామి కాలనీ, నెహ్రూ నగర్ బిట్ 1, 2 ఏరియాలో పైడి లక్ష్మణరావు, పైడి ఇందిర ల ఆధ్వర్యంలో 21 వ రోజు పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను దోపిడీ విధానాలను సైతం ప్రతి ఒక్కరికీ తెలియజేస్తున్నాను అని అన్నారు. ఏలూరు నియోజకవర్గంలో ఉన్న 50 డివిజన్లలో ప్రతి ఇంటికి తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేస్తున్నానని, ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్గించారు. నగరానికి అతి చేరువలో ఉన్న ఆముదాల అప్పలస్వామి కాలనీ ఈ ప్రాంత అభివృద్ధిని ప్రభుత్వం విస్మరించిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏలూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆళ్ళనాని, మేయర్, స్థానిక కార్పొరేటర్ ఎవరు కూడా స్పందించకపోవడం సిగ్గు చేటని, పేద మధ్యతరగతి ధనిక అని తేడా లేకుండా ఈ వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఇంట్లో సమస్యలు కనిపిస్తున్నాయి అని ఒక్కో డివిజన్ లో ఒక్కో రకమైన సమస్య ఉందని ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట అనే కార్యక్రమం ద్వారా ప్రతి అంశాన్ని అధ్యయనం చేసే అవకాశం తనకు కలిగిందన్నారు. తాను అధ్యయనం చేసిన ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపేలా ప్రతి డివిజన్ కీ సంబంధించిన మ్యానిఫెస్టోలను రూపొందిస్తామన్నారు. ఈ కాలనీలో నీళ్ళ కొరత తీవ్రంగా ఉంది. మౌళిక వసతుల కల్పనలో పూర్తిగా విఫలమైంది. రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం లేదు. చాలా దారుణమైన పరిస్థితిలో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించకపోతే జనసేన పార్టీ నుండి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తామని లేని పక్షంలో జనసేన పార్టీ తరపున ఈ సమస్యలను పరిష్కరిస్తానని ఆళ్ళనానిని హెచ్చరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీకి సంబంధించిన సుమారు 30 మంది కార్యకర్తలు జనసేన కండువా కప్పుకుని రెడ్డి అప్పల నాయుడు సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు,సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, కార్యనిర్వహక కార్యదర్శి గొడవర్తి నవీన్, కార్యవర్గ సభ్యులు బోండా రాము, నాయకులు నిమ్మల శ్రీనివాసు, కందుకూరి ఈశ్వరరావు, సోషల్ సర్వీస్ మురళి, బొద్దపు గోవిందు,స్థానిక జనసేన పార్టీ నాయకులు వెంకట రమణ, తేజ, బాలాజీ, సాయి, ఘని, చిన్ని, పండు, రవి, వంశీ, విశాఖ్, నారాయణరావు, సూరి నారాయణ, లక్ష్మణరావు, సాయి లక్ష్మణ్, శ్రీకాంత్, ప్రకాష్ రావు, శ్రీను, చంద్ర, అప్పన వీర మహిళలు లంకా ప్రభావతి, సరళ, సుజాత, ఉమా దుర్గ తదితరులు పాల్గొన్నారు.