విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్లో లింగసముద్రం జనసేన

కందుకూరు, లింగసముద్రం మండల కేంద్రంలో విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తున్నాము. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని, మరెందరో బలిదానాల పుణ్యఫలమే విశాఖ ఉక్కు ఆరోజు నిలబడింది, ప్రస్తుతం నష్టాలతో నడుస్తున్నది అనే చిన్న నెపంతో ప్రైవేట్ వ్యక్తులకు ధరాగ్రతం చేయడం పూర్తిగా ఆంధ్రులకు చేసే ద్రోహంగానే మేము పరిగణిస్తున్నాము. అధికార వైసీపీ కి 22 మంది ఎంపీలు ఉన్న, టీడీపీ కి ముగ్గురు ఎంపీలు ఉన్న పార్లమెంట్ ఆవరణంలో విశాఖ ఉక్కు కొరకు కనీసం ఒక ప్లకార్డు కూడా ప్రదర్శించలేని ఇరుపార్టీల నాయకులు, “తల్లి పాలివ్వలేదని తల్లిని అమ్మాలన్నట్లు – ఆదాయం లేదని ఉక్కు కర్మాగారాన్ని అమ్ముతున్నట్లు” కేంద్రం ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ మన యొక్క నెల్లూరు ఎంపీ అయిన ఆదాల ప్రభాకర రెడ్డికి లింగసముద్రం జనసేన పార్టీ తరుపున మీరు లోకసభలో విశాఖ ప్రైవేటీకరణను వ్యతిరేకిన్చాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో లింగసముద్రం మండల నాయకులు మార్తాటి బ్రహ్మయ్య, గంధం రామ్ తేజ, రవీంద్ర, గణేష్, ప్రసాద్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.