ఢిల్లీపై కేంద్రానికి మరిన్ని అధికారాలు కట్టబెట్టే బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికార ఆప్‌ పార్టీ, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మరో షాక్‌ ఇచ్చింది. కేంద్రం తరుఫున ప్రాతినిథ్యం వహించే లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టే ఢిల్లీ బిల్లుకు లోక్‌సభ ఆమోదించింది. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ప్రభుత్వం (సవరణ) బిల్లు 2021కు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది.

ఢిల్లీపై పెత్తనం, అధికారాలకు సంబంధించి కేజ్రీవాల్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ మధ్య నెలకొన్న వివాదంపై 2018లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ వివాదం తేలకుండానే కేంద్రానికి మరిన్ని అధికారాలు.. ఢిల్లీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీరుపై సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మండిపడుతున్నారు. మిగతా రాష్ట్రాల మాదిరిగా ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా, అధికారాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్టమెంట్‌లో ప్రవేశపెట్టగా తాజాగా లోక్‌సభ ఆమోదం తెలిపింది.