వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతి

ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కారాల ప్రకటన ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో వైద్యశాస్త్రంలో మొదటగా నోబెల్ బహుమతిని ప్రకటించారు. ఈ ఏడాది వైద్య రంగంలో ‘ హెపటైటిస్‌ సి ‘ వైరస్‌ గుర్తింపులో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తలు హార్వే జే.అల్టర్‌, మైఖెల్‌ హాటన్‌, ఛార్లెస్‌ ఎం.రైస్‌ లను నోబెల్‌ వరించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది హైపటైటిస్‌ (కాలేయంలో మంట) తో బాధపడుతూ కాలేయ క్యాన్సర్‌ బారినపడుతున్నారు. హెపటైటిస్‌ లో ఎ, బి వైరస్‌ రకాలుండగా.. ఇప్పటికీ చాలా కేసుల్లో సరైన కారణాలు తెలియలేదు. హార్వే, మైఖేల్‌, ఛార్లెస్‌ లు ఈ వైరస్‌లపై మరిన్ని పరిశోధనలు చేసి ‘ హెపటైటిస్‌ సి ‘ వైరస్‌ను గుర్తించారు. దీనివల్ల హెపటైటిస్‌ కు మందు కనుగొనడం మరింత సులభతరం కావడమే గాక, చాలామంది ప్రాణాలను వైద్యులు రక్షించగలుగుతున్నారు. ‘ హెపటైటిస్‌ సి ‘ వైరస్‌ను గుర్తించడంలో కృషి చేసిన ఈ ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్‌ వరించింది.