ప్రైవేట్ స్కూల్స్ దోపిడీని అరికట్టాలి: జనసేన

*ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు రాబడుతున సందర్భంగా అందుకు వ్యతిరేకంగా కడప జిల్లాలో డి.ఈ.ఓ కి లెటర్ అందించిన జనసేన నాయకులు

ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తున్న సందర్భంగా చర్యలు తీసుకోవాలని డి.ఈ.ఓ దేవరాజ్ కు జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం జనసేన నాయకులు ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్ దోపిడీని అరికట్టాలని ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూల్స్ వసూళ్ల గురించి ఒక సర్క్యులేషన్ ఇవ్వమని జనసేన పార్టీ విన్నవించుకుంది. దీనిపై సానుకూలంగా స్పందించిన డి.ఈ.ఓ ప్రైవేట్ స్కూల్స్ కు సర్క్యులేషన్ జారీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు కోనేటి హరి రాయల్, సిద్దవటం మండల ఇన్చార్జి కొట్టే రాజేష్, కడప జనసేన నాయకుడు బోర్ రెడ్డి నాగేంద్ర జనసైనికులు పాల్గొన్నారు.