వైకాపా పాలనలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యం: గురాన అయ్యలు

విజయనగరం, వైకాపా పాలనలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని, ఏ గ్రామంలో చూసినా ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని జనసేన నేత గురాన అయ్యలు ఆరోపించారు. ఆదివారం రాత్రి కోరుకొండ గ్రామంలో ఇంటింటికి జనసేన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి, ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని జనసేన పార్టీ రూపొందించిన మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా పాలన చేస్తున్నా గ్రామాల్లో ఎక్కడా అభివృద్ధి కానరాలేదన్నారు. విజయనగరం మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో వీధి దీపాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే కష్టంగా ఉందని కోరుకొండ గ్రామ ప్రజలు వాపోతున్నారన్నారు. గ్రామాల అభివృద్ధి గురించి పట్టించుకునే నాధుడే కనిపించడం లేదన్నారు. పారిశుధ్యం లోపించి, దోమలు వృద్ధిచెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. గ్రామాల్లోని రోడ్లు అధ్వానంగా మారాయని ఆరోపించారు. ప్రజలు కట్టిన పన్నుల సొమ్ముతో విజయనగరం పట్టణంలో సుందరీకరణ పేరుతో జిమ్మిక్కులు చేస్తున్న ఎమ్మెల్యే కోలగట్ల గ్రామాల్లో ఎందుకు అభివృద్ధి పనులు గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. విజయనగరం నియోజకవర్గ అభివృద్ధికి వైకాపా పాలనలో రాష్ట ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తీసుకువచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపా అరాచక పాలనను ప్రజలు దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికల్లో జనసేన-టిడిపి కూటమిని ప్రజలు ఆదరించాలన్నారు. దేశంలో సరి కొత్త నేరాలు సృష్టించడంలో సైకో సీఎం జగన్మో హన్‌రెడ్డి చరిత్ర సృష్టిస్తున్నాడని విమర్శించారు. ఓటమి భయంతోనే వైకాపా నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాశీస్సులతో త్వరలోనే రాష్ట్రంలో ప్రజా పాలన వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ టిడిపి నేతలు సిరిపురపు బంగారు నాయుడు, రొంగలి కృష్ణ, వర్రి సంతోషి, అప్పల కృష్ణ, కోరుకొండ జనసేన నేతలు సిరిపురపు దేముడు, సిరిపురపు శ్రీనివాసరావు, గాదె నాగరాజు, గంట్లాన సింహద్రి నియోజకవర్గ జనసేన నేతలు డి.రామచంద్రరాజు, విసినిరిగిరి శ్రీనివాసరావు, రేగిడి లక్ష్మణరావు, కాటం అశ్విని, మాతా గాయిత్రి, పితాల లక్ష్మీ, దుప్పాడ జ్యోతి, రవితేజ, రవీంద్ర, పిడుగు సతీష్, దుప్పాడ నరేష్, ఎమ్.పవన్ కుమార్, వజ్రపు నవీన్ కుమార్,శ్రీకాంత్, పృథ్వీ భార్గవ్, కె.సాయి, కంది సురేష్ కుమార్, వెంకట రమణ, మధు తదితరులు పాల్గొన్నారు.