LOVE STORY రివ్యూ

అక్కినేని నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా తెలంగాణ ప‌ల్లె క‌థ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా ల‌వ్ స్టోరీ. క్లాస్ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ఓ రియ‌ల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ క‌థ‌ను తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ కంపోజ్ చేసిన మ్యూజిక్ తెలుగు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆకట్టుకోగా… శ్రీ శ్రీ‌నివాస సినిమాస్ సంస్థ నిర్మించింది.

రేవంత్, మౌనిక ఇద్ద‌రూ ఆర్మూర్ కు చెందిన వారు. త‌మ క‌ల‌ల‌తో హైద‌రాబాద్ వ‌చ్చి ఎలా ఇబ్బందిప‌డ్డారు… సాఫ్ట్ వేర్ జాబ్ దొరక్క మౌనిక రేవంత్ డాన్స్ అకాడ‌మీలో చేర‌టం… వారిద్ద‌రు ప్రేమ‌లో ప‌డటం, కులాలు వేర‌ని ఇంట్లో ఇబ్బందులు, ఎలా అంద‌ర్నీ ఒప్పించే ప్ర‌య‌త్నం చేస్తార‌న్న‌దే ఈ ల‌వ్ స్టోరీ సినిమా.

తెలంగాణ‌లో ఉన్న కులాల ఆధిప‌త్యం, ల‌వ్ స్టోరీని ద‌ర్శ‌కుడు ప‌ర్ ఫెక్ట్ గా ప్రొజెక్ట్ చేశాడ‌ని చెప్పుకోవ‌చ్చు. కొన్ని చోట్ల ఈ సీన్స్ శేఖ‌ర్ క‌మ్ముల మూవీలోనా అనిపించేంత బోల్డ్ గా కూడా ఉంటాయి. నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి కాంబో సూప‌ర్ గా వ‌ర్క‌వుట్ అవుతుంది. వీరిద్ద‌రు పాత్ర‌ల్లో జీవించిన‌ట్లుగా క‌నిపిస్తుంది. పేరుకు ల‌వ్ స్టోరీయే అయినా మాములు ల‌వ్ సినిమాల‌కు, ఈ సినిమాకు చాలా తేడా ఉంటుంది. నిజానికి ఈ స్టోరీ యూత్ తో పాటు పెద్ద‌వాళ్ల‌కు క‌నెక్ట్ అయ్యేలా ఉంటుంది. న‌టుల ఎంపిక ఈ సినిమాకు పెద్ద ప్ల‌స్ అని చెప్పుకోవ‌చ్చు. ఇక మ్యూజిక్ ఇప్ప‌టికే సూప‌ర్బ్ టాక్ తో దూసుకుపోగా, కొన్నిచోట్ల సినిమా సినిమా న‌రేష‌న్ స్లోగా అనిపించ‌టం, క‌మ‌ర్షియ‌ల్ ప్రేక్ష‌కుల‌కు కాస్త ఇబ్బందిగా అనిపించే సినిమా ల‌వ్ స్టోరీ.